వీర నారి ఝాన్సీ లక్ష్మీబాయి కథతో క్రిష్ దర్శకత్వంలో ‘మణికర్ణిక’ సినిమా మొదలైనపుడు తెలుగు వాళ్లు చాలా గొప్పగా ఫీలయ్యారు. మన దర్శకుడు ఇలాంటి మెగా ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తుండటం ఇక్కడి వాళ్లందరికీ ఆనందం కలిగించింది. కానీ దర్శకుల పనిలో బాగా జోక్యం చేసుకుంటుందని పేరున్న కంగనతో క్రిష్ ఎలా వేగుతాడో అని సందేహాలు వ్యక్తం చేసిన వాళ్లూ లేకపోలేదు. చివరికి ఆ అనుమానాలే నిజమయ్యాయి. కంగనాతో వేగలేక క్రిష్ ఈ చిత్రం చివరి దశలో బయటికి వచ్చేసిన విషయం అధికారికంగానే రూఢి అయింది. ఈ చిత్రంలో మిగిలిన సన్నివేశాల్ని ఇప్పుడు స్వయంగా కంగనానే డైరెక్ట్ చేసుకుంటోంది. క్రిష్ లాంటి విలక్షణ దర్శకుడితో కంగనా.. నిర్మాతలు వ్యవహరించిన తీరు చర్చనీయాంశమవుతోంది. బాలీవుడ్ జనాలు కూడా దీన్ని తప్పుబడుతున్నారు. క్రిష్ ను అవమానించారని.. కంగనా ఈ ప్రాజెక్టును హైజాక్ చేసిందని విమర్శిస్తున్నారు.
ఐతే ఈ చిత్ర నిర్మాతలు మాత్రం అలాంటిదేమీ లేదనేశారు. క్రిష్ వేరే ప్రాజెక్టు మీదికి వెళ్లడంతోనే కంగనా దర్శకత్వ బాధ్యతలు చేపట్టిందని.. ఆమె అన్యాయంగా ఏమీ ఈ సినిమాను తన చేతుల్లోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. కంగనా మొదట్నుంచి సినిమాకు సంబంధించిన క్రియేటివ్ వ్యవహారాల్లో కీలకంగా ఉంటోందని.. ఆమెకు స్క్రిప్టు గురించి అన్నీ తెలుసని.. క్రిష్ అందుబాటులో లేని నేపథ్యంలో ప్యాచ్ వర్క్ పూర్తి చేయడానికి కంగనానే సరైన ఆప్షన్ అనిపించిందని వివరించారు. తమకు కంగనాపై పూర్తి నమ్మకం ఉండటంతోనే ఆమెకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించామన్నారు. ఈ విషయంలో కంగనాను నిందించడానికేమీ లేదని స్పష్టం చేశారు. సోనూ సూద్ సినిమా నుంచి అనూహ్య రీతిలో తప్పుకోవడంపైనా నిర్మాతలు వివరణ ఇచ్చారు. ‘సింబా’ కోసం సోనూ గడ్డం పెంచి లుక్ మార్చుకోవడం.. డేట్ల విషయంలో ఇబ్బంది రావడంతోనే అతను ఈ సినిమాకు దూరమయ్యడన్నారు. అంతా ఓకే కానీ.. ఎప్పుడో పూర్తి కావాల్సిన సినిమా ఎందుకు ఆలస్యమైంది.. ప్యాచ్ వర్క్ ఎందుకు బ్యాలెన్స్ పడింది.. అన్నది మాత్రం నిర్మాతలు వివరించలేదు. క్రిష్ తీసిన సన్నివేశాల్నే మార్చి తీయడానికే కంగన డైరెక్టర్ సీట్లోకి వచ్చిందని.. ఈ నేపథ్యంలోనే క్రిష్ ఆ ప్రాజెక్టును వదిలేసి ముందు చెప్పిన సమయానికి ‘యన్.టి.ఆర్’లోకి వెళ్లిపోయాడు అని అంటున్నారు.