ప్రతి భాష సినిమా పరిశ్రమలో కూడా ఒక తేడా క్యాండేట్ ఉంటాడు. అందరు హీరోలను స్టార్స్ అని.. గొప్ప వాళ్లని పొగుడుతూ ఉంటే ఆ ఒక్క తేడాగాడు మాత్రం హీరోలను ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటాడు. ప్రతి విషయాన్ని కూడా రాద్దాంతం చేసి తను పబ్లిసిటీ దక్కించుకోవడంతో పాటు హీరోలను డీ గ్రేడ్ చేసేలా వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. టాలీవుడ్ లో కూడా అలాంటి వారు ఉన్నారు. బాలీవుడ్ విషయానికి వస్తే తనకు తాను సినీ విమర్శకుడిని అని చెప్పుకుంటూ స్టార్ హీరోలను మరియు ఇండస్ట్రీ వర్గాల వారిని విమర్శిస్తూ పబ్బం గడుపుకుంటున్న కమల్ ఆర్ ఖాన్. ఈయన ఇటీవల సల్మాన్ పై చేసిన విమర్శలకు కోర్టు కేసులను కూడా ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు మొత్తం బాలీవుడ్ స్టార్స్ ను టార్గెట్ చేసి విమర్శలు చేయడం మొదలు పెట్టాడు.
తాజాగా ఆయన వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది హీరోలు ప్లాప్ సినిమాలను చేస్తున్నారు. ఒక వేళ వారు చేసిన సినిమాను ప్లాప్ మూవీ అంటే ద్వేషం అంటారు. వారికి వారు వారి సినిమాలను ఆహా ఓహో అన్నట్లుగా చెప్పుకుంటూ ఉంటారు. శివాయ్.. 83.. ఫ్యాన్.. సత్యమేవ జయతే ఈ సినిమాలను ప్లాప్ అని చెప్తే వారు ఒప్పుకోరు. కాని అసలు విషయం ఏంటంటే.. జనాలు అనుకునేది ఏంటీ అంటే ఆ సినిమాలు ప్లాప్. బాలీవుడ్ హీరోలు వాళ్లకు వాళ్లు తాము జీనియస్ లము అని భావిస్తూ ఉంటారు. వాళ్లు తీసిన సినిమాలు వాళ్లు చూడరు.. వారి కుటుంబ సభ్యులు చూడరు. కాని ప్రేక్షకులతో బలవంతంగా చూపిస్తారు. జనాలు ఆ సినిమాలను తిరస్కరించినా కూడా వాటిని మాస్టర్ పీస్ సినిమాలని స్టార్స్ నెత్తిన పెట్టుకుని ప్రచారం చేస్తూ ఉంటారన్ని అన్నాడు.
జనాలకు మీరు చేసే సినిమాలు నచ్చడం లేదు. అందుకే విడుదల అయిన 95 శాతం సినిమాలు ప్లాప్ గా నిలుస్తున్నాయి. జనాలు అంతగా తిరష్కరిస్తున్నా కూడా స్టార్ హీరోలు అంతా కూడా మూర్ఖుల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. మూర్ఖులు కనుకే సినిమాల ఎంపిక విషయంలో జాగ్రతలు పడకుండా ఇష్టానుసారంగా సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన షారుఖ్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. జాన్ అబ్రహం.. అజయ్ దేవగన్ లతో పాటు ఇంకా పలువురు స్టార్స్ విషయంలో కమల్ ఆర్ ఖాన్ విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. సినిమా విమర్శకుడిని అంటూ చెప్పుకుని ఇలా మొత్తం ఇండస్ట్రీని తప్పుబట్టడం.. స్టార్ హీరోల పట్ల గౌరవం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం ఏమాత్రం సబబు కాదు అన్నట్లుగా కొందరు సోషల్ మీడియా ద్వారా కమల్ ఆర్ ఖాన్ కు సూచిస్తున్నారు.