కరోనా వైరస్ ప్రభావం గత రెండు మూడు నెలల నుంచి బాగా తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే మీడియాలో కరోనా వార్తలు కూడా తగ్గిపోతున్నాయి. అలా అని వైరస్ ప్రభావాన్ని పూర్తిగా కొట్టి పారేయడానికి వీల్లేదని చెప్పడానికి అప్పుడప్పుడూ కొన్ని ఉదాహరణలు కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని రోజుల కిందటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కరోనా పాజిటివ్‌గా వెల్లడి కావడం తెలిసిందే. ఇప్పుడు మరో ప్రముఖుడు కరోనా బారిన పడ్డారు. ఆయనెవరో కాదు.. లోకనాయకుడు కమల్ హాసన్. ఇటీవలే అమెరికా పర్యటనను ముగించుకుని ఇండియాకు చేరుకున్న కమల్.. కరోనా పాజిటివ్‌గా తేలారు. ఇండియాకు వచ్చినప్పటి నుంచి దగ్గు సమస్య ఇబ్బంది పెడుతుండటంతో కమల్ కొవిడ్ పరీక్ష చేయించుకున్నారు. ఆయనకు పాజిటివ్ వచ్చింది. కమల్‌కు అమెరికాలోనే వైరస్ సోకి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
కమల్ ముందుగా ఆయన హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ఆ తర్వాత ఆయన ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. కమల్‌కు కరోనా అని తెలియగానే అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. సోషల్ మీడియాలో ఆయన పేరు ట్రెండ్ అయింది. కమల్ త్వరగా కోలుకోవాలని అందరూ విషెస్ చెబుతున్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ పార్టీ ఘోర పరాభవం చవిచూశాక ఆయన మళ్లీ సినిమాల మీద దృష్టిపెట్టారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 'విక్రమ్' సినిమా షూటింగ్‌లో విరామం లేకుండా పాల్గొంటూ వచ్చారు. మధ్యలో బిగ్ బాస్ ఐదో సీజన్ మొదలు కావడంతో దానికీ కొంత సమయం కేటాయిస్తూ వస్తున్నారు. త్వరలోనే కమల్ 'ఇండియన్-2' షూటింగ్‌ను కూడా పున:ప్రారంభిస్తారని చెబుతున్నారు. వివిధ కారణాల వల్ల ఈ చిత్ర షూటింగ్ రెండేళ్ల కిందట ఆగి.. తర్వాత పున:ప్రారంభం కాని సంగతి తెలిసిందే.