కంచె అక్కడ సెట్టవ్వదేమో బాబాయ్‌!!

Update: 2015-11-12 17:30 GMT
వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ తెరకెక్కించి కంచె.. ఇప్పుడు కంచె తెంచుకుని బాలీవుడ్ లోకి అడుగుపెట్టనుందని తెలుస్తోంది. గతంలో గబ్బర్ తో హిందీలోనూ సక్సెస్ సాధించిన క్రిష్.. ఇప్పుడు కంచెను భారీ బడ్జెట్ చిత్రంగా మలిచేందుకు రెడీ అవుతున్నాడు. నిజానికి ఈ మూవీకి డబ్బింగ్ ఆఫర్స్ బాగానే వచ్చాయి. ఫ్యాన్సీ రేట్ ఇచ్చేందుకు కూడా ప్రొడక్షన్ హౌజ్ లు ముందుకొచ్చాయి. కానీ క్రిష్ మాత్రం కంచెనీ హిందీలో రీమేక్ చేసేందుకే మొగ్గుచూపుతున్నాడు.

అయితే హిందీలో కంచె అంటే కొన్ని విషయాలు ఆలోచించాలి. రెండో ప్రపంచ యుద్ధం కాన్సెప్ట్ తో తెరకెక్కే చిత్రం కాబట్టి.. ఇండియా అంతా వర్కవుట్ అవుతుంది అనిపిస్తుంది. కానీ.. ఇక్కడే జనాలకు కనెక్ట్ అవడం కోసం., వైజాగ్ లో బాంబ్ అనీ, అక్కడ జపాన్ వాళ్లు వేసిన బాంబ్ పేలలేదని ఇలా చాలానే చెప్పాల్సి వచ్చింది. ఇన్ని చెప్పినా.. ఓపెనింగ్స్ డల్ గానే  అనిపించాయి. కానీ రిలీజ్ తర్వాత మౌత్ టాక్ బాగుందని స్ప్రెడ్ అవడంతో.. తర్వాత నిర్మాతగా ఊపిరి పీల్చుకున్నాడు క్రిష్.

ఇప్పుడు హిందీలో కంచె తీయడమంటే.. మళ్లీ నేటివిటికి తగ్గట్టుగా లవ్ స్టోరీ కంప్లీట్ గా మారిపోతుంది. ఇక్కడ తీసినట్లు లో బడ్జెట్ తో బండి లాగించేద్దామంటే అయ్యే యవ్వారం కాదు. పైగా తెలుగువారికి బాగా దగ్గరైన ఆ కుల వ్యవస్థ అక్కడ వేరే రకంగా ఉంటుంది. నార్త్‌ లో కుల వ్యవస్థ అంటే వేరే రకంగా చూపించాలి. ఇకపోతే రీమేక్‌ చేస్తే.. కాస్టింగ్ తో సహా ఇలాంటి బ్యాక్‌ డ్రాప్‌ సమస్యలు తలెత్తుతాయి. అవన్నీ అక్కడికి అమర్చాలంటే కష్టం.  నిజానికి ఇలాంటి ప్రాబ్లెమ్స్ కారణంగానే.. అప్పట్లో గమ్యం రీమేక్ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు కంచె ది కూడా అదే పరిస్థితి. కాకపోతే స్ర్కిప్టులో భారీ మార్పులే చేస్తే మాత్రం వర్కవుట్ అవుతుందేమో. అన్ని సినిమాలూ పోకిరీ, గజిని టైపులో సెట్టవ్వవు బాబాయ్‌!!
Tags:    

Similar News