వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా కంచె. ప్రగ్య జైస్వాల్ కథానాయికగా నటించింది. క్రిష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. నాటి యుద్ధంలో విశాఖ పరిసరాల్లో జపాన్ ఆర్మీ కవాతు చేసిన దృ శ్యాల్ని, యుద్ధ సన్నివేశాల్ని చూపించనున్నారు.
ఇటీవలే రిలీజైన టీజర్ లు, పాటలకు జనాల నుంచి చక్కని ప్రశంసలొచ్చాయి. దేశాల మధ్య సరిహద్దులు, మనుషుల మధ్య సరిహద్దులు, మనసుల మధ్య సరిహద్దులు అనే కాన్సెప్టుతో ఉద్వేగభరితమైన ప్రేమకథా చిత్రాన్ని చూపిస్తున్నానని క్రిష్ ఇదివరకే చెప్పారు. ఈ సినిమా టీజర్ లో వరుణ్ లుక్ - యాక్టింగ్ స్టయిల్ ని పవర్ స్టార్ అంతడి వాడే ప్రశంసించారు. ఇప్పటికే సెన్సార్ వారు యు/ఎ ఇచ్చారనే విషయం చెప్పుకున్నాం. ఇకపోతే సెన్సార్ బృందం నుంచి ఓ క్లాసిక్ సినిమా ఇదన్న ప్రశంసలు దక్కాయి. క్రిష్ ఈ చిత్రాన్ని పూర్తి వైవిధ్యమైన బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించడం అందరిలో డిష్కసన్ పాయింట్ అయ్యింది.
అయితే ఈ సినిమా గురించి ఒక ఎక్స్‌క్లూజివ్ టాక్ తెలుస్తోందట. ఈ సినిమా ఎండింగ్ లో హీరో వార్ కారణంగా గాయాలపాలై చివరకు ప్రాణాలు విడిచే సీన్ ఉందట. ఇక ఇదే కాకుండా హీరో హీరోయిక్ గా పోరాడి తిరిగొచ్చే పాజిటివ్ క్లయ్ మ్యాక్స్ కూడా తీశాడట క్రిష్. అయితే ఈ రెండింటిలో ఇప్పుడు నెగెటివ్ క్లయమ్యాక్స్ తో సెన్సార్ చేయించాడా లేకపోతే పాజిటివ్ ఎండింగ్ తో సినిమాను క్లోజ్ చేశాడా అనే విషయం మాత్రం తెలియట్లేదు. అసలు సినిమాను వాయిదా వేసింది అది డిసైడ్ చేసుకోలేకనే అనే అనుమానం కూడా ఉంది. మరి ఎండింగ్ ఏ వైపు డిసైడ్ చేశాడో ఏంటో...