కంగ‌న ఇందిరాగాంధీని దించేసిందిగా!

Update: 2022-07-14 07:30 GMT
బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్  వెండి తెర‌ ప్ర‌యోగాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హీరోల‌తో రొమాంటిక్ పాత్ర‌లు చేస్తుంది. అవ‌స‌న‌ర‌మైతే  క‌త్తి ప‌ట్ట‌లి యుద్దాలు సైతం చేయ‌గ‌ల దిట్ట‌. స్టార్ హీరోల చిత్రాల్లో న‌టిస్తూనే...ఉమెన్ సెంట్రిక్ పాత్ర‌ల‌తోనూ స‌త్తా చాటుతుంది. కెరీర్ ప్రారంభమై రెండు ద‌శాబ్ధాల‌కు చేరువ‌లో ఉన్నకంగ‌న ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో సినిమాలు చేసింది.

వాటిలో కొన్ని సాహ‌సోపేత‌మైన పాత్ర‌లు కంగ‌న‌కి బాలీవుడ్ లో ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొచ్చాయి. అందుకే అన‌తి కాలంలో నే కంగ‌న బాలీవుడ్ క్వీన్ గా వెలిగింది. తాజాగా కంగ‌న మ‌రో ఛాలెంజింగ్ రోల్ తో ప్రేక్ష‌కుల ముందుకు రావానికి రెడీ అవుతోంది. మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ ప్ర‌ధాన పాత్ర‌లో 'ఎమెర్జెన్సీ' అనే సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా కోసం స్వ‌యంగా కంగ‌న క‌థ సిద్దం చేసారు. కంగ‌న‌ స్వీయా ద‌ర్శ‌క‌త్వంలోనే ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ అనౌన్స్ మెంట్  టీజ‌ర్  రిలీజ్ చేసారు. ప్ర‌ధాని ఇందిరా గాంధీ ఆహార్యంలో కంగ‌న ఒదిగిపోయింద‌నే చెప్పాలి. ఇందిర ఆహార్యాన్ని కంగ‌న‌ పిన్ టూ పిన్ దించేసింది. అచ్చంగా ఇందిరా గాంధీకి అచ్చు గుద్దిన‌ట్లే ఉంది.

హెయిర్ విగ్గు...ముఖానికి ప్రోస్తెటిక్ మేకప్..గుండ్రని క‌ళ్లు..పెద్ద చెవులు.. ముఖ వ‌చ్చ‌స్సుని ఎలివేట్ చేసేలా ఆ ముక్కు పొడ‌వు అన్ని ఇందిరాగాంధీకి జెరాక్స్ కాపీలో ఉన్నాయి. వాయిస్ ఓవ‌ర్ ఎంతో ప‌ర్పెక్ట్ గా సూట‌య్యాయి. టీజ‌ర్ చివ‌ర్లో ఇందిరాను అంతా స‌ర్ అని పిలుస్తార‌ని అమెరికా అధ్య‌క్షుడికి తెలుసా? అని చెప్పే అసాధార‌ణ డైలాగ్ హైలైట్ అని చెప్పాలి.

'ఎమెర్జెన్సీ' చాలా ప‌వ‌ర్ ఫుల్ కంటెంట్ తో తెర‌కెక్కుతోంది. 1975 లో జ‌రిగిన కొన్ని య‌ధార్ధ సంఘ‌ట‌న‌లు ఆధారంగా  చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అప్ప‌ట్లో దేశంలో విధించిన  యెమర్జెన్సీని సినిమాలో ప్ర‌ధానంగా హైలైట్ చేస్తున్నారు. ఆ స‌మ‌యంలో దేశ ప్ర‌ధానిగా  ఇందిరాగాంధీ తీసుకున్న కొన్ని సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాలు దేశాన్ని కాపాడుకోవ‌డంలో కీల‌క పాత్ర  పోషించాయి.

స‌రిగ్గా సినిమాలో  అదే  పాయింట్ ని  హైలైట్ చేస్తున్నారు. ఇందులో అనుప‌మ్ ఖేర్..శ్రేయాస్ త‌ల్పాడే..భూమికా  ఛావ్లా ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. రితేషా షా  సినిమాకి క‌థ‌నం..మాట‌లు అందిస్తున్నారు. మ‌ణిక‌ర్ణిక ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై రేణు పిట్టి..కంగ‌న సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసి వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.
Tags:    

Similar News