బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తన పాస్ పోర్టు పునరుద్ధరణను పోలీసులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని పంచాయితీ పెట్టింది. ఇందులో మహారాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉందంటూ ఆరోపణలు చేసింది. తనను కావాలనే వేధిస్తోంది అని చెప్పుకొచ్చింది. ఇంతకీ విషయం ఏమంటే...
కంగనా రనౌత్ పాస్ పోర్టు గడువు ముగిసింది. దాన్ని రెన్యూవల్ చేయాల్సి ఉంది. రెన్యూవల్ దరఖాస్తు చేయగా.. తాము చేయలేమని చెప్పారు అధికారులు. కారణం ఏమంటే.. ఆమెపై దేశ ద్రోహం కేసు నమోదై ఉంది. ఈ కేసు ఉన్నందు వల్ల తాము రెన్యూవల్ చేయడం సాధ్యం కాదని అధికారులు తేల్చి చెప్పారు. తన సినిమా షూట్ నిమిత్తం హంగేరీ వెళ్లాల్సి ఉంది.
దీంతో.. కోర్టు మెట్లు ఎక్కింది కంగనా. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఈ నెల 25వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు చెప్పింది. దీంతో.. కోపం తట్టుకోలేకపోయినట్టుంది. వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వంపై తిట్ల దండకం అందుకొని, మధ్యలోకి అమీర్ ఖాన్ ను సైతం లాక్కొచ్చింది.
తన పాస్ పోర్టు పునరుద్ధరణను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని ఆరోపించింది. అంతేకాదు.. గతంలో అమీర్ ఖాన్ భారత ప్రభుత్వాన్ని దూషించాడని, మరి, అప్పుడెందుకు ఆయన పాస్ పోర్టును నిలిపివేయలేదని లా పాయింటు లాగింది.