మాటలతోనే తూటాలు పేల్చడం .. శత్రువుకు తూట్లు పొడవడం క్వీన్ కంగనకు తెలిసిన విద్య. మాటల్లోనే గజకర్ణ గోకర్ణ విద్యల్ని ప్రదర్శించగలదు. కంగన ధాటికి నువ్వా నేనా? అనేంతటి దిగ్గజాలే తోకలు ముడిచారు. ఎదురెళ్లలేక నోరెత్తక సైలెంట్ గా మూలన పడి ఉన్నారు. మహేష్ భట్.. కరణ్ జోహార్.. కండల హీరో హృతిక్ రోషన్ అంతటి వాళ్లే కంగనను తట్టులేకపోయారు అంటే అర్థం చేసుకోవచ్చు. అగ్ర నిర్మాతలు.. నటవారసులకు నిరంతరం టార్చర్ తప్పడం లేదు. ఫెమినిజానికి పరాకాష్ట అంటే కంగన అనడంలో ఎలాంటి సందేహం లేదు. తనని కెరీర్ ఆరంభం ఆడుకున్న వాళ్లందరిపైనా ఇప్పుడు కక్ష తీర్చుకుంటోంది. దొరికిన వాళ్లను దొరకని వాళ్లను వెంటాడి వేధిస్తోంది. పబ్లిక్ వేదికలపై మీడియా ముఖంగా చీల్చి చెండాడుతోంది. సోదరి రంగోలి సాయంతో నచ్చని వాళ్లపై శివతాండవం ఆడుతోంది.
ముఖ్యంగా కంగన బాధితుల్లో హృతిక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయ్యో పాపం హృతిక్ అని జాలి పడాల్సిన సన్నివేశమే నెలకొంది. అతడు నిత్య బాధితుడు. ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా కంగన తొలిగా తూటాలు పేల్చేది అతడిపైనే. హృతిక్ .. రాకేష్ రోషన్ బృందంపై ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంది. ఇటీవలే సూపర్ 30 .. మెంటల్ హై క్యా రిలీజ్ తేదీల వ్యవహారంలోనూ ఆ ఇద్దరి మధ్యా సరికొత్త వార్ కి తెరలేచింది. హృతిక్ సూపర్ 30 కి పోటీగా తన సినిమా `మెంటల్ హై క్యా`ని రిలీజ్ చేస్తున్న ఏక్తా కపూర్ గట్స్ ని కంగన తెగ పొగిడేసింది. వాళ్లు తోక ముడుస్తారు.. మనకు సైడిస్తారు.. అంటూ హృతిక్ పై వ్యంగ్యంగానే స్పందించింది కంగన.
ఈ మెంటల్ లార్చర్ తట్టుకోలేను మహా ప్రభో.. అంటూ హృతిక్ ముందే చేతులెత్తేశాడు. మాటలతోనూ విషం చిమ్ముతుంది... ఆ టార్చర్ భరించడం కంటే రిలీజ్ ని వాయిదా వేసుకోవడమే మంచిదని నా నిర్మాతలకు చెప్పానని హృతిక్ సామాజిక మాధ్యమాల వేదికగా ఒక దండం పడేశాడు. దానికి కంగన సైతం అంతే ధీటుగా స్పందించింది. అరెరే పాపం హృతిక్ రోషన్... ఏంటీ సాబ్ స్టోరీ.. (జాలి దయ కలిగించేలా) నవ్వొస్తోంది.. అంటూ రిప్లయ్ ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే హృతిక్ ని కవ్విస్తూ క్వీన్ పదే పదే అతడిని కెలికేందుకు కాలు దువ్వుతోంది. అయితే ఇలాంటి శివంగి నోట్లో నోరు పెట్టడం ఎందుకు? అని హృతిక్ పలాయనం చిత్తగిస్తున్నాడు. సినిమా హిస్టరీలో ఒక అగ్ర హీరోకి ఇలాంటి సన్నివేశం ఏనాడూ ఎదురై ఉండదు. అలాంటి ధీనమైన స్థితినే ఎదుర్కొంటన్నాడు సదరు హీరో. మొత్తానికి కంగన ఆడుకుంటోంది అంటే అతిశయోక్తి కానే కాదు. కంగన నటించిన మెంటల్ హై క్యా చిత్రాన్ని జూన్ 21న రిలీజ్ చేయాలనుకున్నా జూలై 26 నాటికి వాయిదా వేశారు. జూలై 26న రావాల్సిన హృతిక్ `సూపర్ 30`ని అర్థాంతరంగా వాయిదా వేసుకున్నారు. కొత్త తేదీని ప్రకటించాల్సి ఉందింకా. హృతిక్ కి సరైన రిలీజ్ తేదీ కుదరకపోతే ఆ పాపం మాత్రం క్వీన్ కంగనదే.