క్రిష్ (X) కంగ‌న‌: ఎవ‌రిది గెలుపు?

Update: 2019-01-24 15:40 GMT
క్రియేటివిటీ విష‌యంలో అభిప్రాయ భేధాలు చాలా స‌హ‌జం. ఒక‌రు ఔన‌న్న‌ది ఇంకొక‌రు కాదంటారు. ఎవ‌రి అభిప్రాయం వాళ్ల‌కు ఉంటుంది. ఎవ‌రి ప‌రిజ్ఞానం ఎంతో తేలేది వాదాపోవ‌దాల్లో మాత్రం కాదు. విజువ‌లైజేష‌న్ పూర్త‌య్యి - తెర‌పైకి వ‌చ్చాక అస‌లు సంగ‌తి తేల్తుంది. అప్పుడు కూడా స‌క్సెసైతే ఒక‌లా.. ఫెయిలైతే ఇంకొక‌లా స్వ‌రం మారుతుంటుంది. అయితే ఎవ‌రైతే త‌మ పంతం నెగ్గించుకుంటారో - ఎవ‌రైతే త‌న పంతం మేర‌కు సినిమా తీస్తారో వాళ్లే జ‌యాప‌జ‌యాల‌కు అంతిమంగా బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది. ఈ శుక్ర‌వారం `మ‌ణికర్ణిక - ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ` సంగ‌తేంటో తేలనుంది. క్రిష్ కంగ‌న‌ను ప‌క్క‌న పెట్టాడా?  లేక కంగ‌న‌యే క్రిష్ ని ప‌క్క‌న పెట్టిందా? అన్న‌ది మాట్లాడే సంద‌ర్భం కాదు ఇది.

ఈ సినిమా విష‌యంలో ఎవ‌రు ఏం త‌ప్పు చేశారో ప్రేక్ష‌క‌దేవుళ్లే తేల్చేసే సంద‌ర్భ‌మిది. గ‌త కొంత‌కాలంగా క్రిష్ - కంగ‌న మ‌ధ్య డిఫ‌రెన్సెస్ గురించి జాతీయ మీడియాలో ప‌తాక‌స్థాయిలో హైలైట్ అయ్యింది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా నువ్వా?  నేనా? అన్న తీరుగా అభిప్రాయ విభేధాలు వ‌చ్చాయి.ఓ ర‌కంగా వార్ న‌డిచింది. స్క్రిప్టు ద‌శ నుంచి ఈ గొడ‌వ మొద‌లైంది. క‌థార‌చ‌యిత కంగ‌న‌ను స‌మ‌ర్ధిస్తే - క్రిష్ మాత్రం ఆ ఇద్ద‌రినీ కాద‌ని వ‌చ్చేశాడు. ఇటీవ‌ల జాతీయ మీడియా లైవ్ ల‌లో మాట్లాడిన కంగ‌న క్రిష్ తెర‌కెక్కించాల‌నుకున్న క‌థ ప‌రిధి చాలా చిన్న‌ద‌ని - ఈ చిత్రాన్ని ఒక రివెంజ్ డ్రామాగా తీయాల‌నుకున్నాడ‌ని కామెంట్ చేయ‌డ‌మే గాక‌ - తాను ఎంచుకున్న క‌థ ప‌రిధి  సార్వ‌జ‌నీన‌మ‌ని స్టేట్ మెంట్లు ఇవ్వ‌డం మ‌రోసారి చర్చ‌కు తావిచ్చింది. తాను మ‌ణిక‌ర్ణిక క‌థ‌కు యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ని ఆపాదించి దేశ‌భ‌క్తి ప్రాధాన్య‌త‌తో ఇతివృత్తాన్ని ఎన్నుకుని అందుకు త‌గ్గ‌ట్టే సినిమాని మ‌లిచాన‌ని కంగ‌న తెలిపింది.

అది నిజ‌మేనా.. కాదా? మ‌ణిక‌ర్ణిక విష‌యంలో ఎవ‌రేం చెప్పుకున్నా? ప‌్రేక్ష‌కుడు కుర్చీ అంచుపై కూచుని.. తాధాత్మ్య‌మై.. త‌న‌ని తాను మైమ‌రిచి .. స్క్రీన్ కి క‌ళ్ల‌ప్ప‌గించి వీక్షించ‌గ‌లిగేలా బిగి స‌డ‌ల‌కుండా వారియ‌ర్ క్వీన్ క‌థ‌నాన్ని న‌డిపించ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యారా.. లేదా? అన్న‌దే ఆ సినిమా రిజ‌ల్టుని తేలుస్తుంది. కంగ‌న చెప్పిన ప్ర‌కారం.. ఈ సినిమాకి అంతా తానే అయ్యి చేసింది కంగ‌న‌. అంటే ఒక‌వేళ ఈ సినిమా ఫ‌లితం ఎలా వ‌చ్చినా ఆ బాధ్య‌త‌ను తానే తీసుకోవాల్సి ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. అభిప్రాయ భేధాల వేళ ఎవ‌రి వాద‌న క‌రెక్ట్? ఎవ‌రి వాద‌న క‌రెక్ట్ కాదు? అన్న‌ది తేలిపోయే రోజొచ్చింది. ఇప్ప‌టికే బాలీవుడ్ లో ప్రివ్యూలు వేశారు. వీటి నుంచి మిడ్ నైట్ లో పూర్తి స్థాయిలో రిపోర్టులు అందేస్తాయి. త‌న ఓట‌మిని కొంద‌రు కాంక్షించారు!  వారి ఆశ‌లు నెర‌వేర‌వు! అని కంగ‌న స్టేట్ మెంట్ ఇచ్చింది. మ‌రి గెలుపు ఎవ‌రిని వ‌రిస్తుందో.. ఎవ‌రి పంతం నెగ్గుతుందో చూడాలి.
Tags:    

Similar News