కేన్స్ 2019: పాల పిట్ట బుర్రుమంది!

Update: 2019-05-18 10:06 GMT
వ్వావ్ .. వ‌హ్వ‌.. ! అంటూ ఫ్యాష‌న్ ప్ర‌పంచం క‌ళ్ల‌ప్ప‌గించి చూసేలా క్వీన్ కంగ‌న కేన్స్ ఉత్స‌వాల్లో వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. మొద‌టి రోజు రెండు డిఫ‌రెంట్ డిజైన‌ర్ డ్రెస్ ల‌లో క‌నిపించి మైమ‌రిపించింది కంగ‌న‌. నేడు మూడో సారి స్ట‌న్నింగ్ లుక్ తో క‌ట్టి ప‌డేసింది. కేన్స్ 2019 సంబ‌రాల్లో క్వీన్ సంథింగ్ స్పెష‌ల్ అన్న చ‌ర్చ  సాగింది. సాటి నాయిక‌లు దీపిక‌.. ప్రియాంక చోప్రాకి ధీటైన పోటీని ఇచ్చింది.

అంతేనా.. భార‌తీయ‌త‌కు సింబాలిక్ గా కంగ‌న మొద‌టి రోజు గోల్డ్ శారీ లో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అలాగే అల్ట్రా మోడ్ర‌న్ బ్లూ ఔట్ ఫిట్ తో వ్వావ్ అనిపించింది. ఈ డ్రెస్ లో అందాల్ని కాస్తంత శ్రుతి మించి ప్ర‌ద‌ర్శించ‌డంపై బోయ్స్ లో చ‌ర్చ సాగింది. బ్రిట‌న్ మ‌హారాణి ఎలిజబెత్ కి క‌జిన్ సిస్ట‌ర్ లా కంగ‌న ఇచ్చిన ఫోజు ఇంకా క‌ళ్ల‌ముందు రింగులు తిరుగుతూనే ఉంది. ఈలోగానే ఇదిగో ఇలా వైట్ అండ్ వైట్ ఫుల్ లెంగ్త్ స్పెష‌ల్ గౌనులో మ‌రోసారి మ‌తిచెడే ట్రీటిచ్చింది.

మాన‌స స‌రోవరంలోని హంస ఇలా డిజైన‌ర్ లుక్ లో దిగొచ్చిందా?  లేక పాల‌పిట్ట గూడు మ‌రిచి కేన్స్ లో వాలిందా? అన్న‌ట్టుగా ఉందీ రూపం. ఈ డ్రెస్ ని ఫ్రెంచి రివీరా లుక్ తో తీర్చిదిద్ద‌డం ఆస‌క్తిక‌రం. కాంజీవ‌రం కంచిప‌ట్టు చీర‌లో క‌నిపించినా కంగ‌న కే చెల్లింది. ఫ్రెంచి యూరోప్ స్టైల్ ని అనుక‌రించినా .. బ్రిటీష్ మ‌హారాణి స్టైలింగ్ ని ఫాలో అయినా ఆవిడ‌కే చెల్లింది. శ‌త్రువుల్ని తిట్టి తాట తీయ‌డంలోనే కాదు.. ఫ్యాష‌న్ ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ ఒణికించ‌డంలోనూ కంగ‌న‌ను కొట్టేవాళ్లే లేరు సుమీ!


Tags:    

Similar News