ఎంత డబ్బుంటే ఏం లాభం.. ఆ డబ్బుతో సంతోషాన్ని కొనగలమా.. అంటూ ఆధ్యాత్మిక ధోరణిలో మాట్లాడేస్తుంటారు సెలబ్రెటీలు. ఇందులో చాలమంది మాటలు హిపోక్రసీ లాగే ఉంటాయి. ఐతే మనసులో ఏదున్నా మొహం మీద కొట్టినట్లు మాట్లాడే బాలీవుడ్ హాట్ హీరోయిన్ కంగనా రనౌత్ మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడట్లేదు. డబ్బుతో సంతోషాన్ని కొనలేం లాంటి మాటల్ని తాను నమ్మనని ఆమె చెప్పింది. ‘‘నేనైతే డబ్బుతో దేన్నయినా కొంటాను. అది సంతోషం అయినా సరే. శాశ్వత సంతోషం కాకపోయినా.. తాత్కాలికంగానైనా డబ్బు వల్ల ఆనందం పొందొచ్చని నా ఉద్దేశం. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నా మాటను ఎవ్వరైనా ఒప్పుకుంటారు’’ అని కంగన కుండబద్దలు కొట్టేసింది.
ఇక తన ఫినాన్షియల్.. హెల్త్ ప్లానింగ్ గురించి కంగనా చెబుతూ.. ‘‘17 ఏళ్లకే నేను చాలా డబ్బు కళ్లజూడటం మొదలుపెట్టాను. ఆ వయసులో ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు డ్రగ్స్.. ఇతర చెడు అలవాట్లకు బానిసలవుతారు. కానీ నేను అలా చేయలేదు. మంచి మార్గమే ఎంచుకున్నాను. నాకంటూ ఓ ఇల్లు కొనుక్కున్నాను. మా కుటుంబానికి సాయం చేశాను. భూమి మీద పెట్టుబడి పెట్టడానికి నా తొలి ప్రాధాన్యం. ఆ తర్వాత జువెలరీ అంటే ఇష్టం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఐతే నా బాడీలో ఫలానా పార్ట్ కోసమంటూ ఎలాంటి ఇన్సూరెన్స్ చేయించలేదు. ఇంతకుముందు ఐటెం సాంగ్స్ చేయొద్దని.. ఎంత డబ్బిచ్చినా పార్టీల్లో డ్యాన్సులేయొద్దని మొండిపట్టు పట్టుకుని కూర్చునేదాన్ని. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నా. రెండు మూడేళ్లుగా డబ్బులు బాగానే సంపాదిస్తున్నా’’ అని పేర్కొంది.