పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పీచమణిచిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కి అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. టాలీవుడ్ - బాలీవుడ్ - కోలీవుడ్ - మాలీవుడ్, శాండల్ వుడ్ .. ఇలా అన్ని పరిశ్రమల నుంచి సెలబ్రిటీలు మన వీరులపై ప్రశంసలు కురిపించారు. ఇండియా స్ట్రైక్స్ బ్యాక్ అంటూ నినదించారు. మన సైనికుల వీరత్వం గురించి ప్రత్యేకించి కొందరు క్వీన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ఇటీవలే `మణికర్ణిక` చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్రలో అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే. ఒక రియల్ దేశభక్తురాలిలో ఎంత కసి ఉంటుందో అంతా తెరపై చూపించడంలో కంగన సఫలమైంది. అందుకే 100కోట్లు పైగా వసూలు చేసింది ఆ చిత్రం. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై వైమానిక దాడుల నేపథ్యంలో మన ఎయిర్ ఫోర్స్ ని పొగిడేసింది క్వీన్ కంగన. సర్జికల్ స్ట్రైక్ చేసిన సైనికుల్ని, భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసల్లో ముంచెత్తింది. నిజానికి గత కొంతకాలంగా రూల్స్ పేరుతో ఉగ్రవాదుల్ని అణచి వేసే చర్యలు చేపట్టకపోవడంపై కంగన గుర్రుమీద ఉంది. జమ్ము కశ్మీర్ బార్డర్ నియమావళిలో ఉన్న ఆర్టికల్ 370ని చెత్త బుట్టలో వేయాలని, మన సత్తా ఎంతో శత్రువుకు అర్థమయ్యేలా చెప్పాలని కంగన పదే పదే ప్రధాని మోదీకి విన్నవించింది. దటీజ్ కాల్డ్ క్వీన్ కంగన.
మరి ఇతర భాషల్లోనూ క్వీన్ రీమేక్ చిత్రాల్లో నటిస్తున్న క్వీన్స్ ఏమన్నారు? అన్నది పరిశీలిస్తే... తమిళ క్వీన్ కాజల్ ఇలా స్పందించింది. భారత వైమానిక దళంలో పని చేసిన వీరాధివీరులకు శాల్యూట్... ఇండియా స్ట్రైక్స్ బ్యాక్.. ఇండియా ప్రతీకారం తీర్చుకుంది.. మోదీ చర్య ప్రశంసనీయం అంటూ పొగిడేసింది. కాజల్ నటించిన పారిస్ పారిస్ త్వరలో రిలీజ్ కి రానుంది. అలాగే తెలుగు క్వీన్ రీమేక్ `దటీజ్ మహాలక్ష్మి`లో నటిస్తున్న తమన్నా సైతం సర్జికల్ స్ట్రైక్స్ పై స్పందించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని చూస్తే ఎంతో గర్వంగా ఉంది. ఆ ధైర్యానికి సెల్యూట్ అని అంది. మలయాళ బ్యూటీ మాంజిమ మల్లూవుడ్ రీమేక్ లో - కన్నడంలో పారుల్ యాదవ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భామలు మాత్రం సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా లేరు.