క్వీనా మజాకానా? నోరు విప్పితే చాలు అపరకాళికలా చీల్చి చెండాడుతోంది. హీరోలు.. నిర్మాతలు.. దర్శకులు.. కోస్టార్స్ కారేరీ చీవాట్ల కనర్హం అన్న తీరుగా క్వీన్ కంగన కత్తి దూస్తోంది. కంగన తో తిట్లు తిననిదెవరు? అని ప్రశ్నించాల్సిన సన్నివేశమే మునుముందు కనిపిస్తోంది. ఆ జాబితాలో ఎందరో ప్రముఖులు ఉన్నారు. ఎదురెళ్లలేక.. ప్రతి ఎటాక్ చేయలేక .. సైలెంట్ గా భరిస్తున్న వాళ్లే ఈ జాబితాలో ఎక్కువ. ఇటీవలే క్రిష్ లాంటి స్టార్ డైరెక్టర్ పై మాటల యుద్ధం సాగించిన కంగన మరో యువహీరోని ఓ రేంజులో ఆడేసుకోవడం ప్రస్తుతం చర్చకొచ్చింది. ఇంతకీ ఎవరా హీరో అంటే చాక్లెట్ బోయ్ రణబీర్ కపూర్ కి పడింది ఈసారి పంచ్.
ఓ మీడియా ఇంటర్వ్యూలో తనలో రగులుతున్న ఓ భడభాగ్నిని బయటకు తీసి.. కుండపోతగా కుమ్మరించింది. రాజకీయాలపై మీ ఒపీనియన్ చెప్పండి అన్న పాపానికి ఆ అంశంలోకి కుర్రహీరో రణబీర్ ని ఫిల్టు పట్టుకుని మరీ లాగింది. మా ఇంటి దగ్గర నిరంతరం నీళ్లు సరఫరా చేయబడును. కరెంటు ఇవ్వబడును! అంటూ రణబీర్ లా చెప్పుకునే అలవాటు నాకు లేదు. నువ్వు ఖరీదైన ఇంట్లో ఉంటావు. కాస్ట్ లీ బెంజ్ కార్ లో తిరుగుతావు. అయినా రాజకీయాల గురించి .. సాటి ప్రజలు- దేశం గురించి పట్టించుకోవా? అంతటి బాధ్యతా రాహిత్యమా? అంటూ సూటిగానే నిలదీయడం సంచలనమైంది. నటవారసులంటే కోడె త్రాచులా అంతెత్తున లేచే కంగన మరోసారి నటవారసుడు రణబీర్ ని ఇంటర్వ్యూ లైవ్ లోనే ఆడేసుకోవడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఇదివరకూ నటవారసురాలు ఆలియా భట్ ని ఓ రేంజులో ఆడుకున్న కంగన ప్రస్తుతం రణబీర్ పైనా దృష్టి సారించి టైమ్ చూసి కొట్టింది అంటూ అంతా ముచ్చటించుకుంటున్నారు. అసలే మణికర్ణిక సక్సెస్ కిక్కులో ఉంది. ఆపై ఇక ఆ నాలుకకు అడ్డూ ఆపూ ఏమైనా ఉంటుందా? అంటూ సెటైర్లు వేస్తున్నారు కొందరైతే. రాజకీయాల్లోకి వస్తారా? ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తారా? అంటే అసలు తాను ఏ పార్టీకి ప్రచారం చేయనని, తనకు రాజకీయాల్లో చేరే ఉద్ధేశమే లేదని కంగన కుండ బద్ధలు కొట్టింది. విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉండే నటవారసులు ఎవరు దొరికినా కంగన పొరపాటున కూడా వదిలిపెట్టదనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి. మరో వారసుడు హృతిక్ కి ఇదివరకూ చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. కంగన ప్రస్తుతం `మెంటల్ హై క్యా` (మే రిలీజ్) అనే చిత్రంలో నటిస్తోంది. తన రియల్ లైఫ్ క్యారెక్టర్ కి దగ్గరగా ఉండే పాత్ర ఇదని సమాచారం! అశ్విని అయ్యర్ తివారీ రూపొందిస్తున్న వేరొక చిత్రంలోనూ నటిస్తోంది.