హృతిక్ రోషన్, కంగనా రనౌత్ ల వ్యవహారం ప్రేమ, బ్రేకప్ నుంచి లీగల్ నోటీసులు, కేసులో పబ్లిక్ లో రచ్చ రచ్చ అయ్యేవరకూ వచ్చింది. ఇప్పుడీ కేసులో ఓ కీలకమైన ట్విస్ట్ ఒకటి వచ్చింది. అసలు కంగనా రనౌత్ కి హృతిక్ రోషన్ నుంచి ప్రేమ పేరిట ఒక్క మెయిల్ కూడా వెళ్లలేదని నిరూపణ అయిందట.
హృతిక్ నుంచి కంగనాకు ఒక్క మెయిల్ కూడా వెళ్లకపోగా.. ఆమె నుంచి మాత్రం హృతిక్ కు 3వేల ఈమెయిల్స్ వెళ్లాయట. అయితే.. నకిలీ ఈమెయిల్ అకౌంట్ తో కంగనాని ఎవరో బురిడీ కొట్టించారు. ఈ స్టార్ హీరోయిన్ ని ఎవరు బోల్తా కొట్టించారో కూడా ఇప్పటికే కన్ఫాం అయిందట. అలాగే హృతిక్ రోషన్ ఫోన్ కాల్స్ ను కూడా ట్రాక్ చేశారు పోలీసులు. గత ఏడు సంవత్సరాల్లో కేవలం 4 సార్లు మాత్రమే హృతిక్ రోషన్ కంగనాతో మాట్లాడడట. అంతే కాకుండా.. క్వీన్ ని కలిసేందుకు క్రిష్ పారిస్ వెళ్లాడన్న ఆరోపణలు కూడా అబద్ధాలే అంటున్నారు. ఈ హీరో పాస్ పోర్ట్ ను పరిశీలిస్తే.. ఈ విషయం వెల్లడైందని పోలీసులు అంటున్నారు.
వీటన్నిటికి కంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. కంగనా రనౌత్ తనకు పంపిన ఈమెయిల్స్ కాపీలని పోలీసులకు ఇచ్చాడు హ్రితిక్. వీటిని ఫోరెన్సిక్ ఎనాలసిస్ చేయిస్తున్నారు పోలీసులు. హృతిక్ కి కంగనా రనౌత్ పంపించిందంటూ పోలీసులకు అందించిన ఈ మెయిల్ కాపీలు.. ఇప్పుడు ఆన్ లైన్ లోకి వచ్చాయి. మొత్తానికి ఈ కథలో.. క్వీన్ కాస్తా విలన్ అయిపోయేట్లుగా ఉంది.