స్వేచ్ఛకి సెంటిమెంట్ తో లింక్

Update: 2016-01-25 06:45 GMT
బాలీవుడ్ లో స్వేచ్ఛ - సెంటిమెంట్ - ప్రజాస్వామ్యం మీద బాగానే చర్చ నడుస్తోంది. మన దేశంలో అభిప్రాయాలను వెలిబుచ్చే స్వేచ్ఛ ఉందనడం.. ప్రపంచంలోనే అతి పెద్ద జోక్ అన్నాడు కరణ్ జోహార్. మన దేశంలో ప్రజాస్వామ్యం రెండో అతి పెద్ద జోక్ అన్నాడు. ఈ కామెంట్స్ దేశవ్యాప్తంగా సంచలనానికి దారి తీయగా.. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మాత్రం, స్వేచ్ఛకు తనదైన అర్ధం చెప్పింది.

చిన్నపుడు మన స్వేచ్ఛ అవతలివాడి ముక్కువరకే అని చదువుకునే ఉంటాం. అలాగే, మాట్లాడే స్వేచ్ఛ అంటే ఇతరుల సెంటిమెంట్ ని గాయపర్చడం కాదని అంటోంది కంగనా. మన దేశంలో అనేక భాషలు, మతాల వారు నివసిస్తున్నపుడు.. మనం మాట్లాడే మాటలు ఇతరులను బాధ పెట్టేవిగా ఉండకూడదని అభిప్రాయపడింది. ఎవరైనా సరే.. తాము మాట్లాడే మాటల శక్తిని అర్ధం చేసుకోవాలని సూచించింది.

సాలా ఖడూస్ చిత్ర ప్రదర్శనకు వచ్చిన ఈ హీరోయిన్.. తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగానే చెప్పేసింది. 'ఒక మాటను చాలా రకాలుగా చెప్పచ్చు, కానీ అందులో ఏది అత్యత్తమమో తేల్చుకోవాలి. ఒకసారి మళ్లీ  మనం మాట్లాడిన మాటలను తరచిచూస్తే, తప్పు చేశాం అనిపించకూడదు. అవతలివారికి వీళ్లు మనకి సంబంధించిన వారు కాదేమో అనిపిస్తే, మనం తప్పుగా మాట్లాడినట్లే' అని చెప్పింది కంగనా రనౌత్. ఈమె మాటల్లో చాలానే అర్ధాలున్నాయంటున్నారు బాలీవుడ్ జనాలు.
Tags:    

Similar News