బ్రేకింగ్‌ : ముంబయిలో దిగిన కంగనా.. హైటెన్షన్‌

Update: 2020-09-09 11:10 GMT
ముంబయిని పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ తో పోల్చినందుకు గాను కంగనాను ముంబయిలో అడుగు పెట్టనిచ్చేది లేదు అంటూ శివసేన కార్యకర్తలు సీరియస్‌ ప్రకటించిన విషయం తెల్సిందే. తాను 9వ తారీకున ముంబయికి వస్తున్నాను. ఎవడి అబ్బ అడ్డుకుంటాడో చూస్తాను అంటూ ప్రభుత్వంలో ఉన్న పార్టీని కంగనా సవాల్‌ చేసింది. దాంతో కంగనా సెక్యూరిటీ విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆమె నేడు ముంబయిలో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో ఎయిర్‌ పోర్ట్‌ వద్దకు వందల మంది మీడియా ప్రతినిధులతో పాటు పదుల సంఖ్యలో ముంబయి పోలీసులు కేంద్ర బలగాలు మరియు కంగనా కు మద్దతుగా వచ్చిన కర్ని సైనికులు వచ్చారు.

కేంద్ర ప్రభుత్వం కంగనాకు వై కేటగిరి భద్రతను కల్పించడం జరిగింది. సెక్యూరిటీ వలయంతో ముంబయి ఎయిర్‌ పోర్ట్‌ లో దిగిన కంగనా రనౌత్‌ ను మాట్లాడించేందుకు మీడియా ప్రతినిధులు భారీ ఎత్తను అక్కడకు చేరుకోగా కంగనా మాత్రం పట్టించుకోకుండా వెళ్లి పోయింది. భద్రత సిబ్బంది ఆమెను సేఫ్‌గా ముంబయిలోని ఆమె నివాసంకు తరలించాడం జరిగింది. ఇదే సమయంలో శివసేన కార్యకర్తలు ముంబయి ఎయిర్‌ పోర్ట్‌ వద్దకు భారీగా చేరుకోగా పోలీసులు వారిని చెదరగొట్టారు.

కంగనా ముంబయిలో అడుగు పెట్టక ముందే ఆమె ఆఫీస్‌ ను ముంబయి మున్సిపల్‌ అధికారులు కూల్చి వేశారు. అక్రమంగా నిర్మించారంటూ కంగనా ఆఫీస్‌ కు ఇప్పటికే నోటీసులు ఇచ్చిన మున్సిపల్‌ అధికారులు నేటి ఉదయం నుండి కూల్చి వేత పనులు మొదలు పెట్టారు. ఆ విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో కంగనా పోస్ట్‌ చేస్తూ మహా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. బాబర్‌ ప్రభుత్వంతో శివసేన ప్రభుత్వంను పోల్చడంతో పాటు అధికార పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించింది.

Tags:    

Similar News