అలియాభట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన `గంగూబాయి కతియావాడి` రిలీజ్ కి ముందు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎలాంటి కామెంట్లు విసిరిందో తెలిసిందే. గంగూబాయి టార్గెట్ గా అలియా సహా అందర్ని ఓ రేంజ్ లో ఆడుకుంది కంగన.
అప్పటికే అలియా భట్ పై విమర్శలు చేసిన కంగనకి తోడుగా కొన్ని సంఘాలు సైతం తోడవ్వడంతో మరింతగా రెచ్చిపోయింది. గంగబాయి టీమ్ ని మాఫియా గ్యాంగ్ గా సైతం అభివర్ణించింది. 200 కోట్లు పెట్టి సినిమా చేస్తున్నారు.
అంతా బూడిదలో పోసిన పన్నిరే అవుతుందని సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విబేధించింది. సినిమాలో క్యాస్టింగ్ బాగోలేదని..సినిమా అతి పెద్ద లోపం అదేనని కంగన గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేసింది.
అలియాను `పాపా కీ ప్యారీ` అని `రోమ్ కామ్ బింబో` అని కూడా కామెంట్ చేసింది. కానీ ఇప్పుడు తాజాగా కంగన ప్లేట్ ఫిరాయించింది. గంగూబాయి బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రశంసలు కురిపించడం మొదలు పెట్టింది. ఏ మీడియా వేదికగా విమర్శించిందో అదే మీడియా వేదికగా గంగూబాయిని ఆకాశానికి ఎత్తేస్తోంది.
సినిమాతో పాటు..ఆలియా భట్ నటనని ప్రశంసించింది. కంగన తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఇలా రాసింది. ``దక్షిణాది చిత్ర పరిశ్రమలో రికార్డులు బద్దలు కొట్టే కలెక్షన్లతో థియేటర్లకు ఊపు వచ్చింది అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. హిందీ బెల్డ్ లో కూడా మంచి పేరొచ్చింది.
అలియాతో సూపర్ స్టార్ డైరెక్టర్ చేసిన గొప్ప చిత్రమిది. థియేటర్లకు ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకమని తెలిపింది. సినిమాపై రిలీజ్ కి ముందు కొంచెం నెగిటివ్ అభిప్రాయం ఉండేది. కానీ ఇలాంటి సినిమాలు కూడా మంచి చేస్తాయని నిరరూపించారు. అలాంటి సినిమాల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తాను అని పేర్కొంది.
మొత్తానికి కంగన ఈగో క్లాషెస్ పక్కనబెట్టి పబ్లిక్ డొమైన్ లో సినిమాని మెచ్చుకోవడం అందర్ని ఆశ్చర్యపరుస్తుంది. దీంతో నెటి జనులు కంగనని పొగిడేస్తున్నారు. మిడి మిడి మాటలకు తావు ఇవ్వకుండా నటిగా కంగన నిజాయితీగా గంగూబాయి గురించి స్పందించిందని అభినందిస్తున్నారు.
`గంగూబాయి కతియావాడి` ఫిబ్రవరి 25న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు `బెర్లీన్` అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లోనూ ఫిబ్రవరి 10న ప్రదర్శింపబడింది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి. కోవిడ్ నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.
ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. భన్సాలీ ప్రొడక్షన్స్- పెన్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించాయి. రిలీజ్ కి ముందు ఈ చిత్రంపై కోర్టులో చాలా కేసులు పడ్డాయి. కమాఠీపుర ప్రజలు తరుపున ఓ మహిళ తమ మనోభావాలు దెబ్బతినేలా సినిమా తీసారంటూ పిటీషన్ లో పేర్కొన్నారు.