'మణికర్ణిక' తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన చిత్రం 'మెంటల్ హై క్యా'. ఈ చిత్రాన్ని మన తెలుగు దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ చిత్రాన్ని జులై 26న విడుదల చేయబోతున్నారు. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయగా టైటిల్ విషయమై పెద్ద వివాదం రావడంతో ట్రైలర్ విడుదలను క్యాన్సిల్ చేశారు.
ఇండియన్ సైక్రియాట్రిస్టు సొసైటీ వారు మరియు ఇంకా పలువురు టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా మొదట కంగనా రనౌత్ టైటిల్ ను మార్చేందుకు నో చెప్పింది. ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో టైటిల్ ను మార్చుతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా మార్చిన టైటిల్ ను యూనిట్ సభ్యులు వెళ్లడించారు. మెంటల్ పదం స్థానంలో కాస్త మార్పు చేసి జడ్జిమెంటల్ అనే పదాన్ని యాడ్ చేయడం జరిగింది.
మెంటల్ హై క్యా టైటిల్ ను కాస్త 'జడ్జిమెంటల్ హై క్యా' అంటూ మార్చారు. టైటిల్ మార్చిన యూనిట్ సభ్యులు ట్రైలర్ ను విడుదల చేసేందుకు సిద్దం అయ్యింది. ఈ చిత్రంలో కంగనా హీరోయిన్ గా నటించగా రాజ్ కుమార్ రావ్ హీరోగా నటించాడు. మెంటల్ హై క్యా టైటిల్ తో సినిమాకు బాగా పబ్లిసిటీ వచ్చింది. ఇలాంటి సమయంలో టైటిల్ ను మార్చాల్సి రావడంతో మెంటల్ ను జడ్జిమెంట్ చేసి పెద్దగా నష్టం లేకుండా జాగ్రత్త పడ్డారు. తెలుగులో దర్శకుడిగా సక్సెస్ అవ్వలేక పోయిన ప్రకాష్ కోవెలమూడి ఈ చిత్రంతో బాలీవుడ్ లో తన మొదటి సక్సెస్ ను దక్కించుకునేలా ఉన్నాడంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.