తోచిందే చేయడం.. తనకు నచ్చనివాళ్లకు ఎదురెళ్లడం క్వీన్ కంగన స్టైల్. కేవలం నటిగానే కాదు - దర్శక రచయిత గానూ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కంగన ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆ విభాగాల్లో వేలు పెట్టడం - చివరికి అవతలి వాళ్లకు విసుగు తెప్పించే లెవల్లో ఇన్వాల్వ్ అవ్వడం నిరంతరం చర్చకొస్తోంది. ఇదివరకూ రచయిత అపూర్వ అస్రానీతో ఇలానే గొడవ పడింది. `రంగూన్` టైమ్ లో అతడితో గొడవ చినికి చినికి గాలివానైంది. క్రియేటివ్ పార్ట్‌లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి అందరినీ చావగొడుతుందని అపూర్వ ఎంతో మదనపడ్డాడు. కంగనపై సూటిగానే ఫైరయ్యాడు. కానీ అదేదీ ఈ బ్యూటీ లెక్క చేయలేదు... సరికదా ఆ పద్ధతిని అసలే మార్చుకోలేదు.
బాలీవుడ్ దిగ్గజాలుగా చెప్పుకునే రాకేష్ రోషన్ - హృతిక్ రోషన్ అంతటి వారినే వదిలిపెట్టలేదు కంగన. తన గయ్యాలితనం ఎలా ఉంటుందో ఆ ఇద్దరికీ రుచి చూపించింది ఇదివరకూ. ఇప్పుడు టాలీవుడ్ దర్శకుడు క్రిష్ వంతు. `గౌతమిపుత్ర శాతకర్ణి` తర్వాత ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి `మణికర్ణిక` చిత్రానికి సంతకం చేశాడు క్రిష్. ఈ సినిమా ఆరంభం నుంచి కంగనతో క్రియేటివిటీ పరంగా విభేధాలొచ్చాయన్న ప్రచారం ఉంది. కంగన ఫింగరింగ్ అంతకంతకు శృతిమించడంతో అతడు తట్టుకోలేక ఏకంగా ఆ ప్రాజెక్టును మధ్యలోనే వదిలేసి పారిపోయి వచ్చేశాడట. ఆ క్రమంలోనే `మణికర్ణిక` పెండింగ్ షూట్ కి కంగన స్వయంగా బాధ్యతలు చేపట్టి తనే దర్శకత్వం వహిస్తోంది.
ఓవైపు కంగన - క్రిష్ మధ్య గొడవల్లో నలిగిపోయిన నిర్మాతలు కిక్కురుమనకుండా సైలెంటుగా అన్నిటినీ భరిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి నిర్మాతలు కంగనకు అకౌంటెంట్లుగా మారిపోయారట. `దర్శకత్వం: కంగన` అని క్లాప్ బోర్డ్ లో కనిపించినప్పుడే ఏదో జరుగుతోంది అనుకున్నారు. కానీ ఇంత జరుగుతోందనుకోలేదు. అన్నంత పనీ చేస్తోంది కంగన. తనకు ఏమాత్రం నచ్చని క్రిష్ ని పక్కన పెట్టి తనే దర్శకత్వం వహించేస్తోంది. అంతేకాదు .. ఇప్పుడు క్రిష్ పై పంతానికి పోయి ఏకంగా 43రోజుల పాటు షూట్ చేసిన సీన్లను కోసేసి - తిరిగి వాటన్నిటికీ తనే దర్శకత్వం వహిస్తోందిట. ఒక క్రియేటర్ ని కించపరుస్తూ కంగన ఇలాంటి డేరింగ్ డెసిషన్ తీసుకుంది అంటే ఆవిడలోని గట్స్ కి మురిసిపోవాలో లేక ఈవిడ పంతం ఏంటో అని విచారించాలో అర్థంకాని పరిస్థితి. ఇక తాను నటించిన మల్ల యుద్ధం సన్నివేశాల్ని సినిమా నుంచి తొలగించడంతో సోనూసూద్ కూడా క్రిష్ లానే అలిగి వెళ్లిపోవడం చర్చకొచ్చింది. ఆ పార్ట్ ని కంగన రీషూట్లు చేస్తోంది. మొత్తానికి మణికర్ణిక సినిమా ఆద్యంతం తన మార్క్ మాత్రమే కనిపించాలని కంగన భావిస్తోందని అర్థమవుతోంది. ఇలా పంతానికి పోయి నిర్మాతల కొంప కొల్లేరు చేసేట్టే ఉంది! అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.