తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. దివంగత జయలలిత జీవితంపై ప్రస్తుతం కొన్ని బయోపిక్స్ తెరకెక్కిస్తున్నారు. అందులో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'తలైవి' ఒకటి. ఈ సినిమాలో జయలలిత పాత్రను బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పోషిస్తోంది. ఈ పాత్ర కంగనా పోషించడం పట్ల చాలామంది తమిళ ప్రేక్షకులలో అసంతృప్తి ఉందట. తమిళ ప్రజలకు ప్రాంతీయ అభిమానం మెండుగా ఉంటుంది. అయితే ఎవరైతే తమిళ భాషను నేర్చుకుని మాట్లాడతారో.. తమిళ సంప్రదాయాలను గౌరవిస్తారో వారిని తమిళులు చక్కగా ఆదరిస్తారు. అలాంటిది తమిళం రాని హిందీ నటిని తీసు కొచ్చి అమ్మ పాత్రలో నటింపజేడంపై వారు గుర్రుగా ఉన్నారట.
ఈ సినిమాలో కంగన కు ఎవరైనా వేరే వ్యక్తి చెప్పాల్సిందే. కంగనా స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకున్నా తమిళంలో అది కుదరని పని. కారణం ఏంటంటే జయలలిత వాయిస్ కు కంగనా వాయిస్ కు సంబంధమే ఉండదు. కంగనా వాయిస్ చాలా తేలికగా ఉంటుంది. అయితే ఫిలింమేకర్ల ఆలోచన వేరేగా ఉంది. కంగన కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. హిందీలో అయితే సూపర్ స్టార్ డమ్ ఉంది. జయలలిత గురించి దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు కాబట్టి..ఆ పాత్రలో కంగనా లాంటి స్టార్ హీరోయిన్ నటిస్తే అది తప్పకుండా పాన్ ఇండియా ఫిలిం గా మారుతుంది. ఈ ఉద్దేశంతోనే దర్శక నిర్మాతలు కంగనాను ఎంచుకున్నారట.
తమిళనాడు తప్ప మిగతా అన్ని చోట్ల కంగన పై వ్యతిరేకత ఉండక పోవచ్చు.. ముఖ్యంగా హిందీలో సినిమాకు భారీ ఆదరణ దక్కవచ్చు కానీ.. తమిళంలో మాత్రం ఈ సినిమా పట్ల వ్యతిరేకత ఉంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఈ వ్యతిరేకతను తలైవి టీమ్ ఎలా అధిగమిస్తుందో తెలియదు కానీ.. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.