ద్వేషపూరిత ప్రవర్తన విధానాన్ని ట్విట్టర్ సహించదు. నియమాల్ని ఉల్లంఘించిన వారికి వేటు తప్పదు. తాజాగా అలాంటి విద్వేషాన్ని రెచ్చగొట్టే పని చేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతా శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టు ట్విట్టర్ ప్రకటించింది. ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలకు ప్రతిస్పందనగా ఆమె వరుస ట్వీట్లను పోస్ట్ చేయడంతో కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాను మంగళవారం నిలిపివేశారు. ప్లాట్ ఫాం నిబంధనలను ఆమె పదేపదే ఉల్లంఘించినట్లు తేలిందని ట్విట్టర్ తెలిపింది.
ఒక ట్విట్టర్ ప్రతినిధి మాట్లాడుతూ..``ఆఫ్ లైన్ హానికి దారితీసే అవకాశం ఉన్న ప్రవర్తనపై మేము బలమైన చర్యలు తీసుకుంటామని ముందే స్పష్టంగా చెప్పాం. ట్విట్టర్ నిబంధనలను పదేపదే ఉల్లంఘించినందుకు కంగన ఖాతాను శాశ్వతంగా నిలిపివేశాం. ద్వేషపూరిత ప్రవర్తన విధానం.. దుర్వినియోగపరిచే ప్రవర్తన విధానం సహించలేం. ప్రతి ఒక్కరికీ మేము ట్విట్టర్ నియమాలను న్యాయంగా నిష్పాక్షికంగా అమలు చేస్తాం`` అని తెలిపారు.
సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో కంగన దుష్ప్రవర్తనకు శిక్ష విధించడం ఇదే మొదటిసారి కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ తాండవ్ పై ఆమె వివాదాస్పద ట్వీట్ పోస్ట్ చేసిన తర్వాత ఆమె ఖాతాపై కొన్ని ఆంక్షలు విధించారు. ``మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు మేకర్స్ నిజంగానే తలదాచుకునే సమయం ఆసన్నమైంది`` అంటూ కంగన ట్వీట్ చేయడం వివాదానికి తావిచ్చింది.
ఒకరిని లక్ష్యంగా చేసుకోవడం లేదా ఇతర వ్యక్తులను అలా ప్రేరేపించడం నిషేధం. మరణం కోరుకునే వారు లేదా అలాంటివి వ్యక్తీకరించే కంటెంట్ ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహానికి వ్యతిరేకంగా తీవ్రమైన శారీరక హానిని కలిగించే వాటిని మేము నిషేధించాం. చదవడానికి-మాత్రమే మోడ్ లో ఖాతాను ఉంచడం వంటి ఉల్లంఘనలను గుర్తించినప్పుడు చర్య తీసుకుంటాం`` అని ట్విట్టర్ ప్రతినిధులు చెప్పారు.
అయితే దీనికి ప్రతీకారంగా కంగన స్పందిస్తూ.. ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీని ట్యాగ్ చేశారు. ``నా ఖాతా .. నా వర్చువల్ ఐడెంటిటీ ఎప్పుడైనా దేశం కోసం అమరవీరులవుతాయి`` అని ఆమె ఒక ట్వీట్ లో రాశారు.