రణబీర్ కపూర్ -అలియా భట్ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర' ఇటీవలే విడుదలై మిశ్రమ స్పందనలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ విడుదల రోజునే పెద్ద ఫ్లాప్ అని తేల్చేసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ 800 కోట్ల నష్టాలు ఖాయమని అంది. ఇప్పుడు మరోసారి ఈ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్ లను వేలెత్తి చూపించింది. బ్రహ్మాస్త్ర సినిమా ప్రస్తుత బాక్సాఫీస్ కలెక్షన్ 150 కోట్ల రూపాయలకు పైగా ఉందని ప్రచారమవుతోంది. అయితే బ్రహ్మాస్త్రా హిట్ అని చెప్పుకునే 'మూవీ మాఫియా'ని కంగనా తిట్టి పోసింది. అసలు గుట్టును 'బహిర్గతం' చేసింది. నిజానికి ఈ సినిమా టిక్కెట్ కౌంటర్లలో ఆశించినంతగా వర్కవుట్ కాలేదని కంగన విమర్శించింది.
కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ కథనంలో.. బాక్సాఫీస్ విశ్లేషణలు చేసే వెబ్ సైట్ AndhraBoxOffice.com ద్వారా చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది. బ్రహ్మాస్త్ర ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 246 కోట్లు రాబట్టిందని ఈ సైట్ చెబుతోంది. అయితే ఈ చిత్రం రూ. 650 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా దాని ముందు ఈ వసూళ్లు చాలా తక్కువ! అని ట్వీట్ లో పేర్కొంది.
దీనిపై కంగనా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.."కేవలం రూ. 144 కోట్ల (650 కోట్ల బడ్జెట్) వసూళ్లతోనే అతిపెద్ద హిట్ అంటూ ప్రకటించారు. ఇది సినిమా మాఫియా ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ప్రూఫ్.. కలెక్షన్లు లేదా రికవరీలతో సంబంధం లేకుండా ఏ సినిమా హిట్ అవుతుందో ఏది ఫ్లాప్ అవుతుందో వారే (మాఫియా పెద్దలు) నిర్ణయిస్తారు. ఎవరిని హైప్ చేయాలో.. ఎవరిని బహిష్కరించాలో వారు ఎంచుకుంటారు. ఇక్కడ అవన్నీ బహిర్గతమయ్యాయి.. అని అన్నారు.
అంతకుముందు కంగన 'బ్రహ్మాస్త్ర' దర్శకుడు అయాన్ ముఖర్జీని కూడా నిందించింది. "అయాన్ ముఖర్జీని మేధావి అని పిలిచిన ప్రతి ఒక్కరినీ వెంటనే జైలులో పెట్టాలి… అతడికి ఈ చిత్రాన్ని రూపొందించడానికి 12 సంవత్సరాలు పట్టింది. ఏకంగా 14 మంది DOPలతో పని చేసాడు. అతను దీనిని 400 రోజులకు పైగా చిత్రీకరించాడు. సినిమా చేసి 85 మంది అసిస్టెంట్ డైరెక్టర్లను (ఏడీలను) మార్చి 600 కోట్లను బూడిద లో పోసారు.
'బాహుబలి' విజయం కారణంగా ఆ స్ఫూర్తితో చివరి నిమిషంలో 'జలాలుద్దీన్ రూమీ ..' నుండి సినిమా పేరును శివగా మార్చడం ద్వారా మతపరమైన మనోభావాలను దోపిడీ చేయడానికి ప్రయత్నించారు… అలాంటి అవకాశవాదులు.. సృజనాత్మకత కోల్పోయిన వ్యక్తులు.. విజయం పేరుతో అత్యాశపరులను మేధావులు అని పిలిచినంత మాత్రాన ఫలితం తారుమారు కాదు. అది ఒక ఫ్లాప్.. ఇంతకీ వారి వ్యూహం ఏమిటో అర్థమైందా? అని అడిగింది. దిన్ కో రాత్.. రాత్ కో దిన్! అని పిలుపునిచ్చింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. కంగన కెరీర్ ఆశించిన తీరుగా లేదు. ఇటీవల తనను తాను యాక్షన్ స్టార్ గా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమైంది. ఆమె చివరి చిత్రం ధాకడ్ ని విమర్శకులు నిషేధించారు.
ఈ మూవీని చూడటానికి ప్రేక్షకులు థియేటర్లలో కనిపించకపోవడంతో థియేటర్ల యజమానులు ప్రదర్శనలను రద్దు చేయవలసి వచ్చింది. ఇప్పుడు తన తదుపరి చిత్రం ఎమర్జెన్సీ కోసం కంగన ఎదురు చూస్తోంది. వీలున్నప్పుడల్లా బాలీవుడ్ మాఫియాపై విరుచుకుపడుతూ కంగన తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.