కన్నడ నటుడు దిగంత్ జిమ్మింగ్ మిస్ ఫైర్ అయ్యింది. బ్యాక్ ఫ్లిప్ ప్రమాదంలో మెడ భాగం వెన్నుపాముకు గాయమై ఆసుపత్రిలో చేరారని సమాచారం. దిగంత్ తన వర్కవుట్ రొటీన్ లో భాగంగా బ్యాక్ ఫ్లిప్ చేస్తున్నప్పుడు తప్పుగా ల్యాండ్ అయ్యాడు. దీంతో అతని మెడ వెన్నుపాము దెబ్బ తిన్నాయని తెలుస్తోంది.
జిమ్ లో ప్రమాదం అనంతరం వెంటనే అతడు ఆసుపత్రిలో చేరాడు. ప్రమాదం జరిగిన సమయంలో అతడు తన కుటుంబంతో వెకేషన్ కి వెళ్లినట్లు సమాచారం. మీడియా కథనాల ప్రకారం.. 37 ఏళ్ల దిగంత్ బ్యాక్ ఫ్లిప్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతని వెన్నుపాము మెడ భాగంలో ఇంబ్యాలెన్స్ వల్ల గాయాలయ్యాయి. అతన్ని మొదట గోవాలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతన్ని పరిశీలనలో ఉంచారు. అనంతరం విమానంలో బెంగళూరుకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.
దిగంత్ గాయాలపై మణిపాల్ ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. బెంగుళూరులోని తమ నిపుణుడైన వైద్యుని సమక్షంలో సంరక్షణ కొనసాగుతున్నట్టు ధృవీకరించింది. ``మిస్టర్ దిగంత్ సాయంత్రం 4:30 గంటలకు మణిపాల్ హాస్పిటల్- ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్.., బెంగుళూరుకు చేరుకున్నారు. అతను డాక్టర్ విద్యాధర HOD & కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ విభాగంలో చేరాడు.
అతని ప్రస్తుత స్థితిని అంచనా వేస్తున్నారు. గోవాలో అతడు గాయపడ్డాడు. చాలా రోజుల క్రితం గోవాలోని మణిపాల్ హాస్పిటల్ లో చికిత్స పొందాడు. అతనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఫలితాల కోసం వేచి ఉన్నాయి`` అని బెంగళూరు మణిపాల్ హాస్పిటల్ ఒక ప్రకటనలో తెలిపింది.
తన రోజువారీ వ్యాయామ దినచర్యలో భాగంగా దిగంత్ బ్యాక్ ఫ్లిప్ చేశాడు. ఈ సమయంలో దురదృష్టవశాత్తు అతని తలపై అధిక భారం పడి మెడకు బలమైన గాయమైంది. దిగంత్ కి ప్రమాదం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు 2017లో `బాలీవుడ్ కి టిక్కెట్టు` అనే హిందీ చిత్రం షూటింగ్ లో కుడి కంటికి గాయమైంది. ఈ ఘటనలో సెట్స్ లో ఒక స్టిల్టో అతని కంటిని తాకడంతో కార్నియా దెబ్బతింది.
దిగంత్ 2006లో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతను 30కి పైగా చిత్రాలలో నటించాడు. పంచరంగి - గాలిపాట చిత్రాలతో హిట్లు కొట్టాడు. మంగారు మేల్ లో అతిథి పాత్రలోను కనిపించాడు. ఆగస్ట్ 12న థియేటర్లలోకి రాబోతున్న గాలిపాట 2 కోసం దిగంత్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇంతలోనే గాయం వార్త అభిమానులను కలవరపరిచింది.