రియల్​ హీరో.. కరోనా వేళ కన్నడ నటుడి సేవ..!

Update: 2021-05-01 02:30 GMT
కరోనా విపత్కర పరిస్థితుల్లో కొందరు సినీ నటులు రియల్​ హీరోలు అనిపించుకున్నారు. వారిలో బాలీవుడ్​ నటుడు సోనూసూద్​ కచ్చితంగా ముందుంటాడు. ఇక అక్షయ్​ కుమార్​ లాంటి నటులు సైతం భారీగా విరాళం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ కొనసాగుతోంది. ప్రియాంకచోప్రా.. అలియా భట్​ లాంటి హీరోయిన్స్​ తమ వంతు సేవలందిస్తున్నారు. కొందరు నటులు మాత్రం ఇంటికే పరిమితమయ్యారు. వీడియోలు విడుదల చేసి చేతులు దులుపుకొంటున్నారు.

 తాజాగా ఓ కన్నడ నటుడు కరోనా టైంలో ఆదర్శవంతంగా వ్యవహరిస్తున్నాడు. ఏకంగా ఆంబులెన్స్​ డ్రైవర్​ అవతారం ఎత్తి కరోనా రోగులకు సేవ చేస్తున్నాడు.కరోనా అంటేనే చాలా మంది భయపడి ఇంటికే పరిమిత మవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఓ హీరో కరోనాతో మరణించిన వారి మృతిదేహాలను శ్మశానానికి తరలిస్తుండటం గమనార్హం. ప్రముఖ కన్నడ నటుడు అర్జున్ గౌడ 'ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్'.. పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ ఆధ్వర్యంలో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను శ్మశానానికి తరలిస్తున్నారు.

ప్రస్తుతం కరోనా మృతదేహాల అంత్యక్రియలు చాలా క్లిష్టంగా మారాయి. అంత్యక్రియలు చేసేందుకు .. మృతదేహాలను తీసుకెళ్లేందుకు అంబులెన్స్​ డ్రైవర్లు సైతం ముందుకు రావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఓ సినీనటుడు ఈ పనికి పూనుకోవడం ఆదర్శంగా నిలుస్తున్నది. 'యువరత్న', 'రుస్తుమ్' లాంటి చిత్రాలతో అర్జున్​ గౌడ పాపులర్​ అయ్యారు. ప్రస్తుతం ఇతడి కృషిని నెటిజన్లు సైతం మెచ్చుకుంటున్నారు.

ఈ విషయంపై అర్జున గౌడ మాట్లాడుతూ.. ' ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది అంత్యక్రియలకు ఇబ్బందులు పడటం నా దృష్టికి వచ్చింది. దీంతో ఎలాగైనా కరోనా అంత్యక్రియలు చేయాలని నాకు ఆలోచన వచ్చింది. అందుకోసం ఓ సంస్థను ఏర్పాటు చేశాను. ప్రస్తుతం నేను స్వయంగా ఓ అంబులెన్స్​ను నడుపుతున్నాను. ఇప్పటివరకు ఆరుగురికి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించాను. మా  సంస్థ తరఫున కరోనా మృతదేహాలకు పెద్ద సంఖ్యలో అంత్యక్రియలు నిర్వహించాం' అని ఆయన చెప్పాడు.
Tags:    

Similar News