మీటూ వివాదాలు సౌత్ ని దావాలనంలా చుట్టుముడుతున్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్ మీద కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్ చేసిన ఆరోపణలు ఇప్పటికే ప్రకంపనలు రేపాయి. 150 సినిమాల్లో నటించిన ఒక అగ్ర హీరో మీద హీరోయిన్ ఇలా నేరుగా పబ్లిక్ లోకి తన మీద జరిగిన వేధింపుల గురించి బయటపడటం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. అర్జున్ తనకు ఏ తప్పు తెలియదని ఇలా నిందలు వేస్తే కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందని చెప్పినా శృతి తగ్గడం లేదు. స్వయానా ఆ చిత్ర దర్శకుడు అర్జున్ జెంటిల్ మెన్ అని సర్టిఫికెట్ ఇచ్చినా ఇది సద్దుమనగలేదు.
మరోవైపు ఇంకో హీరోయిన్ సంజనా గల్రాని దర్శకుడు రవి శ్రీవాత్సవ తన మొదటి సినిమా షూటింగ్ లో బెదిరించి మరీ బోల్డ్ సీన్స్ తీయించాడని బయట పెట్టడం మరో రచ్చకు కారణమైన సంగతి తెల్సిందే. పాతికేళ్ల తన పేరు ఈ ఆరోపణ వల్ల నాశనం అయ్యిందని శ్రీవాత్సవ ఓపెన్ గానే చెబుతున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనే దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. మారా అనే మీడియా సంస్థలో పని చేసే ఏక్తా అనే ఉద్యోగి సదరు దర్శకుడు స్క్రీన్ రైటర్ గా ఉన్నప్పుడు తన స్నేహితురాలికి పరిచయమయ్యాడని తర్వాత మెల్లగా తన మనసులో దుర్బుద్ధిని బయటపెట్టుకున్నాడని ఇప్పుడు ఈ మీటూ చైతన్యం చూసాక తనకూ చెప్పాలనిపించిందని ఫేస్ బుక్ పోస్ట్ చేసింది.
ఇవన్నీ ఆరోపణలను ఎదురుకుంటున్న వారిని ఇంకా చిక్కుల్లో పడేస్తున్నాయి. పరిశ్రమ పెద్దలు సైతం దీనికి మద్దతు పలకాలా లేక తప్పు చేయలేదు అంటున్న హీరోల దర్శకుల తరఫున వకాల్తా పుచ్చుకోవాలా అర్థం కాక అయోమయంలో ఉన్నారు. ఎంత దూరమైనా వెళ్తామని ఈ ఇద్దరు హీరోయిన్లు చెప్పడం చూస్తూనే వ్యవహారం ముదిరేలా ఉంది. కాకపోతే టాలీవుడ్ లో దీనికి తాలూకు సెగలు ఏమి లేనట్టుగానే ఉంది. బయటివాళ్లకు మన హీరోయిన్లు మద్దతు ఇస్తున్నారు కానీ ఇక్కడ కూడా మీటూ బాధితులు ఉన్నారనేలా ఎవరు ముందుకురాకవడం విశేషం. అక్కడికి సంతోషించవచ్చు.