కన్నడ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం మదకరి నాయక రచ్చ జరుగుతుంది. ఇద్దరు కన్నడ స్టార్ హీరోలు కిచ్చా సుదీప్ మరియు దర్శన్ లు ఒకే బయోపిక్ కోసం పోటీ పడుతున్నారు. ఇద్దరు కూడా మదకరి నాయక బయోపిక్ ను చేయాలని ఉవ్విల్లూరుతున్నారు. కన్నడ ప్రజల గుండెల్లో ఎప్పటి నిలిచిపోయే మదకరి నాయక జీవిత చరిత్రను కన్నడ ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చాలా ఏళ్లుగా నిర్మాతలు మరియు దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఇంతకాలం అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలు ఆ మహానుభావుడి బయోపిక్ కు సిద్దం అయ్యారు.
సుదీప్ దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. ఈ బయోపిక్ కు గురుదత్తా గనిగా, సంచిత్ లలో ఒకరు డైరెక్ట్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే సుదీప్ ప్రకటించాడు. తన భార్య ప్రియా రామకృష్ణన్ నిర్మాతగా వ్యవహరించనుందని సుదీప్ ఆమద్య పేర్కొన్నాడు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సమయంలోనే దర్శన్ తో రాక్ లైన్ వెంకటేష్ మదకరి నాయక బయోపిక్ ను నిర్మిస్తున్నట్లుగా ప్రకటించాడు.
తాజాగా మదకరి నాయక స్వస్థలం అయిన చిత్రదుర్గను దర్శన్, రాక్ లైన్ వెంకటేష్ ఇంకా దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబు లు సందర్శించారు. సినిమా కోసం అక్కడ పరిస్థితులను మరియు మదకరి నాయక చరిత్రను తెలుసుకునేందుకు వారు వచ్చారంటూ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కాని వారు మాత్రం దసరా వేడుకల్లో భాగంగా అక్కడకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఒకవైపు సుదీప్ మదకరి నాయక సినిమాను ప్రకటించి స్క్రిప్ట్ వర్క్ కూడా చేయిస్తుండగా, మరో వైపు దర్శన్ ఆ బయోపిక్ ను చేసేందుకు సిద్దం అవ్వడంతో సుదీప్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
సోషల్ మీడియాతో పాటు, బహిరంగంగానే దర్శన్ పై దాడికి సుదీప్ ఫ్యాన్స్ ప్రయత్నిస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ బయోపిక్ వివాదం రాజుకుంటున్న నేపథ్యంలో కన్నడ సినీ ప్రముఖుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఇద్దరు స్టార్ హీరోల మద్య వివాదం ఎక్కడకు దారి తీస్తుందో అంటూ కన్నడ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కేవలం 31 ఏళ్లు మాత్రమే బతికి కర్ణాటకలోకి చిత్రదుర్గం రాజ్యంను పరిపాలించి, మంచి పేరు తెచ్చుకున్న మదకరి నాయక బయోపిక్ ను చివరికి ఎవరు చేస్తారు, ఎలా చేస్తారో అంటూ కన్నడ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.