బెడ్ మీద నేనంత గుడ్ కాదు బాబా!!

Update: 2016-02-17 04:27 GMT
మనసులో మాటను నిర్భయంగా పైకి చెప్పేస్తాడనే గుర్తింపు బాలీవుడ్ నిర్మాత కం దర్శకుడు కరణ్ జోహార్ కు ఉంది. ఫిలిం మేకర్ గానే కాకుండా బుల్లితెరపై నిర్వహించే టీవీ షోస్ తోనూ ఖ్యాతి సంపాదించాడు కరణ్ జోహార్. 'హాట్ చాక్లేట్ విత్ కరణ్ అండ్ ఆదిత్య' అంటూ నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఫితూర్ యాక్టర్ ఆదిత్య రాయ్ కపూర్ వచ్చాడు. ఇందులో కరణ్ అడిగిన కొన్ని ప్రశ్నలకు.. ఆదిత్య చాలా తెలివిగా దాటవేసే సమాధానాలు చెప్పాడు. కానీ ఆదిత్య అడిగిన క్వశ్చన్స్ కి మాత్రం కరణ్ జోహార్ ఓపెన్ గా ఆన్సర్ ఇచ్చేశాడు.

పార్ట్ నర్ తో శారీరక సంబంధం ఎంత మేరకు అవసరమంటూ ఆదిత్యరాయ్ ను అడిగాడు కరణ్. 'భాగస్వామితో శారీరక సాన్నిహిత్య సంబంధం చాలా ముఖ్యమే. అయితే.. ఇదే మొదటిది లేదా ప్రధానమైనది అని చెప్పను కానీ.. ఖచ్చితంగా ఫిజికల్ రిలేషన్ ఉండాల్సిందే' అంటూ ఇంటెలిజెంట్ ఆన్సర్ ఇచ్చిన ఆదిత్య.. వెంటనే ఓ తుంటరి ప్రశ్న వేశాడు. బెడ్ మీద ఎవరు గుడ్ గా పెర్ఫామ్ చేయాలి.. అమ్మాయా?అబ్బాయా? అని అడిగాడు ఆదిత్య రాయ్ కపూర్.

ఈ ప్రశ్నకు కొంచెం ఇబ్బంది పడ్డ కరణ్.. చివరకు బోల్డ్ ఆన్సర్ ఇచ్చాడు. 'బెడ్ మీద ఉన్నపుడు నేనేం చేస్తున్నానో నాకు అర్ధం కాదు. కొన్నింటి అద్భుతంగా చేసేంతటి సామర్ధ్యం నాకు లేదనుకుంటా.  ఎందుకంటే నేను ఎక్కువగా సిగ్గు పడుతుంటా' అన్నాడు కరణ్ జోహార్.
Tags:    

Similar News