బాలీవుడ్ లో నటవారసత్వాన్ని(నెప్టోయిజం) ప్రశ్నించే డేరింగ్ క్వీన్ గా కంగన గురించి చెప్పాల్సిన పనే లేదు. కాఫీ విత్ కరణ్ షోలో కంగన ఎందరినో తూర్పారబట్టింది. బాలీవుడ్ అగ్ర నిర్మాతలందరినీ కంగన లైవ్ లోనే చీవాట్లు పెట్టే ప్రయత్నం చేసింది. కరణ్ జోహార్ నే టీవీ షో లైవ్ లో ప్రశ్నలతో తూట్లు పొడిచింది. అలియా భట్- జాన్వీ కపూర్- అనన్య పాండే- వరుణ్ ధావన్ - ఇషాన్ ఖత్తర్ సహా కరణ్ ఎందరినో వెండితెరకు పరిచయం చేశారు. ఇక పరిశ్రమ ఇన్ సైడ్ వ్యక్తులకే ఆయన బాసటగా నిలవడం .. బయటి వారికి అంతగా అవకాశాలు కల్పించకపోవడం అన్నది నాటి నుంచి హాట్ డిబేట్ గా మారింది. ప్రస్తుతం సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత మరోసారి నెప్టోయిజంపై ఆసక్తికర డిబేట్ రన్ అవుతోంది.
అంతేకాదు సుశాంత్ ఆత్మహత్య కరణ్ అభిమానుల్లోనూ ఆగ్రహాన్ని కలిగించింది. కరణ్ జోహార్ ఇన్ స్టా లో ఏకంగా లక్ష మంది ఫాలోవర్స్ ని కోల్పోయారు. ఈ సంఖ్య 11 మిలియన్ నుండి 10.9 మిలియన్లకు పడిపోయింది. దీనిని బట్టి నటవారసులకు మాత్రమే అగ్ర తాంబూలం ఇచ్చే కరణ్ పై సుశాంత్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారని ప్రూవైంది. కరణ్ జోహార్ .. యశ్ రాజ్ అధినేతలు కానీ ఎవరైనా బాలీవుడ్ సినీపెద్దలు సుశాంత్ పై ఉద్ధేశపూర్వక కుట్ర చేశారన్నది అభిమానుల నెటిజనుల ఆరోపణ.
తనని ఇండస్ట్రీ ఇన్ సైడ్ అవార్డు వేడుకలకు పిలవలేదు. పార్టీలకు పిలవలేదు. అంతేనా చిచోరే లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కూడా అతడికి ఏకంగా ఆరు సినిమా ఛాన్సులు వచ్చినట్టే వచ్చి దూరమయ్యాయి. ఇవన్నీ అతడిని తీవ్ర కలతకు గురి చేశాయి అన్నది స్పష్ఠంగా అర్థమవుతోంది. సుశాంత్ సైతం పలు ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని బహిర్గతం చేశారు. అయితే సుశాంత్ లోని ఒత్తిడి వెనక ఇండస్ట్రీ తప్పిదం ఉన్నా.. కరణ్ ని అభిమానులు టార్గెట్ చేయడం చర్యనీయాంశమైంది.
అయితే కరణ్ నటవారసులకు తప్ప వేరే వాళ్లకు అవకాశం ఇవ్వడా? అంటే.. ఒకానొక సందర్భంలో కరణ్ దానికి బదులిచ్చారు. తన ధర్మ ప్రొడక్షన్స్ లో 21 మంది కొత్త దర్శకులను పరిచయం చేశానని చెప్పారు. ఇందులో పదిహేడు మంది బయటివారేనని వెల్లడించారు. వారివల్ల తాను క్రెడిట్ పొందలేక పోయానని అన్నారు. ఇక ఆలియా- వరుణ్ ధావన్ లాంటి నటవారసుల్ని పరిచయం చేసినప్పుడు వందలాది మందితో ఆడిషన్స్ లో పోటీపడి ఎంపికయ్యారని కరణ్ వెల్లడించారు. వరుణ్ ధావన్ నాకు సహాయకుడిగా పని చేసినప్పుడు అతడిలో హార్డ్ వర్క్ చూసి అవకాశం కల్పించానని అది తప్పు కాదని తన వైపు నుంచి వాదన వినిపించారు. తాను నెప్టోయిజాన్ని మాత్రమే ప్రోత్సహించడం లేదని వాదించారు కరణ్.