ఇప్పుడంటే సద్దుమణిగింది కాని నాలుగు నెలల క్రితం బాలీవుడ్ లో నెపోటిజం(వారసత్వం) గురించి జరిగిన రాద్ధాంతం చిన్నది కాదు. కరణ్ జోహార్ - రన్బీర్ కపూర్ - కంగనా రౌనత్ - వరుణ్ ధావన్ - సైఫ్ అలీ ఖాన్ నేరుగా స్టేజిల మీదే దీని గురించి నానా మాటలు అనుకుని మీడియా సాక్షిగా రచ్చ రచ్చ చేసుకున్నారు. స్టార్లు, డైరెక్టర్లు తమ పిల్లల్లో టాలెంట్ ఉన్నా లేకపోయినా బలవంతంగా పరిశ్రమలోకి తీసుకొచ్చి వాళ్ళను ప్రేక్షకుల పైకి రుద్దుతున్నారు అనే దాని మీద చాలా పెద్ద చర్చే జరిగింది. కొందరు టంగ్ స్లిప్ అయ్యారు కూడా. తర్వాత సారీలు చెప్పుకోవడంతో కొంత మేర సర్దుకుంది. ఈ ఇష్యూ లో ఎక్కువ యాక్టివ్ గా ఉన్నది కరణ్ జోహారే. తన కాఫీ విత్ కరణ్ షో లో దీని గురించి చాలా సార్లు ప్రస్తావించాడు. మరోసారి కరణ్ దీని గురించి మాట్లడడం హాట్ టాపిక్ గా మారింది.
తన పిల్లలను బలవంతంగా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ప్రశ్నే లేదన్న కరణ్ వాళ్ళకు వాళ్ళు ఇష్టపడితే తప్ప ప్రోత్సహించనని చెప్పాడు. ఇద్దరు పిల్లలకు తండ్రైన కరణ్ ఇలా అనడం ఆశ్చర్యమే. నిజానికి బాలీవుడ్ లో హీరో - హీరొయిన్లు - దర్శకులు - నిర్మాతలు ఇలా అందరూ తమ పిల్లల్ని సినిమాల్లోకి తెచ్చినవారే. ఇప్పుడు కరణ్ ఈ మాటే అన్నా భవిష్యత్తులో తీసుకురాకుండా ఉండలేరని అంటున్నారు. స్టార్ హీరో హీరొయిన్ల పిల్లల్ని పరిచయం చేయటంలో ఎక్స్ పర్ట్ అయిన కరణ్ శ్రీదేవి కూతురు జాహ్నవిని పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడిలాగే అంటారు కాని పిల్లలకు వయసు వచ్చాక కరణ్ జోహారే తీసుకొస్తారు అని వస్తున్న కామెంట్స్ కి సమాధానం దొరికేది భవిష్యత్తులోనే.