హీరోయిన్ తో క‌లిసి నిర్మాత తాగి డ‌య‌ల్ చేశాడ‌ట‌

Update: 2022-08-18 02:30 GMT
`కాఫీ విత్ కరణ్ 7` వ‌రుస‌ ఎపిసోడ్స్ తో క‌ర‌ణ్ దుమ్ము రేపుతున్నాడు. కొంచెం తీపి కొంచెం వగ‌రు ఇంకొంచెం చేదు అన్నీ ఈ షోలో ఉన్నాయి. కొన్ని వివాదాలు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఈసారి సిద్ధార్థ్ మల్హోత్రా- విక్కీ కౌశల్ షోలో క‌ర‌ణ్ ప్ర‌శ్న‌లు ఇప్పుడు హాట్ టాపిక్. కాఫీ విత్ కరణ్ 7 తాజా ఎపిసోడ్ లో హోస్ట్ కరణ్ జోహార్ విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ ల వైవాహిక జీవితంతో పాటు.. సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీల భవిష్యత్తు గురించి ప్ర‌శ్న‌లు కురిపించాడు.

తాజాగా విక్కీ కౌశల్ - సిద్ధార్థ్ మల్హోత్రా జోడీ తో ప్రోమో విడుద‌లైంది. ఈ ప్రోమోలో క‌ర‌ణ్ ఊహించ‌ని స‌ర్ ప్రైజ్ థింగ్ ని ఆడియెన్ కి రివీల్ చేశారు. క‌ర‌ణ్- అలియా భట్ ఓ సంద‌ర్భంలో బాగా తాగి విక్కీ కౌశల్ (క‌త్రిన‌తో పెళ్లికి ముందు) కి డయల్ చేసామ‌ని వెల్లడించాడు. తాగి కాల్ చేసిన సంఘటన గురించి KJo మాట్లాడుతూ-``మేమిద్ద‌రం ఓసారి తాగి విక్కీకి డయల్ చేసాము. ఆ స‌మ‌యంలో వైన్ తాగుతున్నాం. మ‌త్తులో చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. మేం పార్టీకి ఇంకా ఎవరిని పిలవాలా? అని ఆలోచిస్తున్నాం! విక్కీకి కాల్ చేశాం. అత‌డు క‌త్రిన‌ను పెళ్లాడ‌క ముందు ఘ‌ట‌న ఇది``అని క‌ర‌ణ్ జోహార్ నిజాయితీగా గుర్తు చేసుకున్నాడు. ``మా ఇద్దరికీ కత్రినా చాలా కాలంగా క్లోజ్. మేం విక్కీతో క‌త్రిన‌ను చూశాం. ఆ త‌ర్వాత ఈ జంట‌ పెళ్లి చేసుకోవడం మమ్మల్ని చాలా ఎమోషనల్ గా హ్యాపీగా మార్చింది``  అన్నారాయన.

విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ 2021 డిసెంబర్ 9న రాజస్థాన్ లోని హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో కుటుంబ సభ్యులు స‌న్నిహితుల స‌మ‌క్షంలో వేడుక‌గా వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

విక్కీ కౌశల్ - సిద్ధార్థ్ మల్హోత్రా ఎపిసోడ్ ఆద్యంతం ఫ‌న్నీ చాటింగ్ తో అల‌రించారు. కత్రినాతో డేటింగ్ చేసిన తర్వాత విక్కీకి కాఫీ విత్ క‌ర‌ణ్ లో ఇది మొదటి ఎపిసోడ్ అయితే.. ఈసారి సిద్ జీవితం గురించి ల‌వ్ లైఫ్ గురించి క‌ర‌ణ్‌ కొన్ని కీల‌క‌ వ్యాఖ్యలు చేసాడు. సిధ్ ని కియ‌రా అద్వాణీ గురించి ప్ర‌శ్నించారు. ప్రోమోలో విక్కీ కౌశల్ -సిద్ధార్థ్ మల్హోత్రా వారి పంజాబీ జీన్స్ గురించి చ‌ర్చ సాగింది.

రాపిడ్ ఫైర్ రౌండ్ సమయంలో విక్కీ ఒంటరిగా ఉండటం గురించి అత‌డ‌ ఏమి మిస్ అవుతున్నాడో అని కూడా ప్ర‌శ్నించారు.  దానికి స్పందిస్తూ.. అదృష్టవశాత్తూ ఇప్పుడు నా మిస్సస్.. అని అన్నాడు. అతని సమాధానం అంద‌రినీ స‌ర్ ప్రైజ్ చేసింది.  షో ఆద్యంతం రంజుగా సాగ‌నుంద‌ని ఈ ప్రోమో వెల్ల‌డించింది. కాఫీ విత్ కరణ్ 7 డిస్నీ+హాట్ స్టార్ లో ప్రతి గురువారం ఉదయం 12 గంటలకు ప్రీమియర్ అవుతుంది.

ఈ సీజ‌న్ లో మెరుపులు ఎన్నో..!

కాఫీ విత్ క‌ర‌ణ్ కొత్త‌ సీజ‌న్ లో  సోనమ్ కపూర్ రక్షా బంధన్ స్పెషల్ ఎపిసోడ్ లో తన సోదరుడు అర్జున్ కపూర్ ను ట్రోల్ చేసేంతగా ర‌క‌ర‌కాల సీక్రెట్స్ గురించి మాట్లాడి ఉక్కిరి బిక్కిరి చేసింది. సోద‌రి సోద‌రుడు ఈ ఎపిసోడ్ లో నిజాయితీగా చాలా సంగ‌తుల‌ను రివీల్ చేసారు. తాజా ఎపిసోడ్ `పంజాబీ ముండా` స్పెషల్ అని చెప్పాలి. ఈ ఎపిసోడ్ లో ఇద్ద‌రు పంజాబీ యువ‌ హీరోలు క‌నిపించారు.

కొత్త సీజ‌న్  మొదటి ఎపిసోడ్ లో రణవీర్ సింగ్ -ఆలియా భట్ సంద‌డి చేసారు. రెండవ ఎపిసోడ్ లో సారా అలీ ఖాన్-జాన్వీ కపూర్... మూడవ ఎపిసోడ్ లో సమంత రూత్ ప్రభు-అక్షయ్ కుమార్.. నాలుగో ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ-అనన్య పాండే.. ఐదో ఎపిసోడ్ లో కరీనా కపూర్ ఖాన్-అమీర్ ఖాన్ .. ఆరో ఎపిసోడ్ లో సోనమ్ కపూర్-అర్జున్ కపూర్ చాట్ షోలో అల‌రించారు. ఈ జాబితాలో ఉన్న ఇతర ప్రముఖుల్లో కృతి సనన్-టైగర్ ష్రాఫ్... కియారా అద్వానీ-షాహిద్ కపూర్... వరుణ్ ధావన్-అనిల్ కపూర్ ... కత్రినా కైఫ్- ఇషాన్ ఖట్టర్- సిద్ధాంత్ చతుర్వేది  త‌దిత‌రులు ఉన్నారు.

విక్కీ కౌశ‌ల్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... భూమి పెడ్నేకర్ - కియారా అద్వానీ ల‌తో క‌లిసి `గోవింద నామ్ మేరా`లో కనిపిస్తాడు. అతడు సారా అలీ ఖాన్ - మేఘనా గుల్జార్ కాంబినేష‌న్ లో `సామ్ బహదూర్‌` లో న‌టిస్తారు. ఇది భారతదేశపు మొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షా జీవితం ఆధారంగా రూపొందుతోంది. ఆనంద్ తివారీతో విక్కీ మూవీకి టైటిల్ ఖ‌రారు కావాల్సి ఉంది.
Tags:    

Similar News