67 ఏళ్ళ తరువాత బాహుబలే - కరణ్‌ జోహార్

Update: 2017-03-26 17:40 GMT
ఎప్పుడూ ప్రిపేర్ అవ్వకుండా వచ్చే నేను..ఇప్పుడు మాత్రం షాకయ్యాను. ఇండియన్ సినిమాలోనే అతి పెద్ద స్టేజ్ అయిన.. బాహుబలి ఫ్లాట్ఫామ్ పై నుంచొని మాట్లాడటమే గొప్ప అవకాశం అని చెబుతూ.. బాహుబలి 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ను ఒక ఊపు ఊపేశాడు బాలీవుడ్ నిర్మాత-డైరక్టర్ కరణ్‌ జోహార్. హిందీలో ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్న ఆయన.. రాజమౌళిని చూసి బాలీవుడ్ దర్శకులు నేర్చుకోవాల్సిందే అంటున్నాడు.

''కె.ఆసీఫ్‌ తీసిన మొఘల్-ఈ-ఆజమ్ మాత్రమే మొత్తంగా భారతదేశాన్ని ఒక తాటిపైకి తెచ్చి.. ఇది మా దేశపు సినిమా అంటూ అందరిచేతా ప్రశంసలు పొందింది. అది 1960లో వచ్చింది. 67 ఏళ్ళ తరువాత ఇప్పుడు 'బాహుబలి' మళ్లీ అలా ఇది మా సినిమా అంటూ దేశాన్ని యునైట్ చేసింది. రాజమౌళికి అందుకు మనం కృతజ్ఞులం అవ్వాల్సిందే'' అన్నారు కరణ్‌ జోహార్. ''ఇండియాలోనే రాజమౌళి చాలా పెద్ద డైరక్టర్ అనడం కూడా చాలా చిన్నమాటే. ఆయన గ్లోబల్ ఫిలిం మేకర్. స్టీవెన్ స్పీల్బర్గ్.. క్రిస్టోఫర్ నోలాన్.. జేమ్స్ క్యామెరాన్ వంటి దర్శకుల సరసన నిలుస్తాడాయన. ఆయన తీసిందాంట్లో నేనే 10వ వంతు కూడా తీయలేదు. వేల మంది ఫిలిం మేకర్లు ఆయన్ను చూసి ఇక నేర్చుకుంటూనే ఉంటారు'' అని చెప్పారు.

ఇక ఈ సినిమా నిర్మాతలు నిర్మాతలు కాదని.. వారు వారియర్స్ అని అన్నారు కరణ్‌. అలాగే ఈ బాహుబలి టీమ్ డెడికేషన్ చూసి బాలీవుడ్ చాలా నేర్చుకోవాలని.. వారికి తాను నేర్పిస్తానని కూడా చెప్పాడు. 'మీ యాంకరింగ్ కూడా సూపరుంది మ్యామ్' అంటూ సుమను కూడా పొగిడేశారు కరణ్‌!!
Tags:    

Similar News