రాజమౌళితో మళ్లీ కరణ్ జోహార్

Update: 2018-07-08 16:47 GMT
‘బాహుబలి’ సినిమా ఉత్తర భారతంలోనూ అంత పెద్ద స్థాయి విడుదలైందన్నా.. అక్కడి ప్రేక్షకులనూ అంతగా ఆకట్టుకుందన్నా అందులో బాలీవుడ్ సీనియర్ ఫిిలింమేకర్ కరణ్ జోహార్ ముఖ్య కారణం. ఆయన ఈ సినిమాను తన చేతుల్లోకి తీసుకోవడంతో దానిపై అక్కడి ప్రేక్షకుల్లో అమితాసక్తి కలిగింది. ప్రమోషన్లు కూడా బాగా చేసి సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేశాడు. జనాల్లోకి తీసుకెళ్లాడు. ఇక సినిమాలోనూ కంటెంట్ ఉండటంతో అది అసాధారణ విజయం సాధించింది. కరణ్ కూడా ఈ సినిమాతో భారీ లాభాలు అందుకున్నాడు. ‘బాహుబలి’ ఇరు వర్గాలకూ ఉభయ తారకంగా పని చేసింది. దీని తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ను కూడా చేజిక్కించుకోవాలని కరణ్ భావించాడు కానీ.. కుదర్లేదు.

ఐతే ‘సాహో’ మిస్సయినా.. రాజమౌళి తర్వాతి సినిమాను మాత్రం కరణ్ జోహారే హిందీలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ ను హిందీలో కరణ్ జోహారే రిలీజ్ చేయబోతున్నాడు. ‘బాహుబలి’ హిందీ వెర్షన్ ను జనాల్లోకి తీసుకెళ్లిన విషయంలో కరణ్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్న రాజమౌళి ఈ చిత్రాన్ని కూడా ఆయనకే అప్పగించాలని ఫిక్సయ్యాడట. ఇందుకు నిర్మాత డీవీవీ దానయ్య కూడా ఓకే అన్నాడట. ఈ డీల్ రేటు ఎంత అన్నది బయటికి రాలేదు. ఐతే ఇరు వర్గాలకీ ఆమోదయోగ్యంగా ఉండేలా రేట్ ఫిక్సయినట్లు సమాచారం. నవంబరులో ఈ చిత్రం సెట్స్ మీదికవ వెళ్లనుంది. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్లో ఈ చిత్రం తెరకెక్కనుంది.
Tags:    

Similar News