బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ నటించిన `జబ్ వి మెట్`లో తన నటనతో లక్షలాది హృదయాలను గెలుచుకుంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో గీత్ అనే పాత్రను పోషించింది బెబో. షాహిద్ కథానాయకుడిగా నటించారు. గీత్ పాత్రతో తాను భారతీయ రైల్వేలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చినట్లు తాజా ఇంటర్వ్యూలో సరదాగా వ్యాఖ్యానించారు.
ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన జబ్ వి మెట్ 2007లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. రైలులో షాహిద్ కపూర్ (ఆదిత్య కశ్యప్)ని కలిశాక గలగలా మాట్లాడేస్తూ ఆకట్టుకునే అమ్మాయి గీత్ పాత్రను కరీనా కపూర్ పోషించింది. ఈ సినిమాలో కరీనా రెండు సార్లు ట్రైన్ మిస్ అయిన తర్వాత షాహిద్ ఆమెకు సహాయం చేస్తాడు. `కేస్ తో బంటా హై` రియాలిటీ షో తాజా ఎపిసోడ్ లో కరీనా మాట్లాడుతూ... భారతీయ రైల్వే ఆదాయాన్ని పెంచడంలో తన పాత్ర సహాయపడిందని అన్నారు. బెబో మాట్లాడుతూ-``మేరే గీత్ ప్లే కర్నే కే బాద్ హరేమ్ ప్యాంట్స్ కి సేల్ ఔర్ ఇండియన్ రైల్వేస్ కి రెవిన్యూ.. దోనో బద్ గయీ హై బై ది వే`` అని వ్యాఖ్యానించింది. ``నేను గీత్ గా నటించిన తర్వాత అంతఃపుర ప్యాంట్ల అమ్మకం .. భారతీయ రైల్వే ఆదాయాలు రెండూ పెరిగాయి`` అని కరీనా అంది.
ఈ ఎపిసోడ్ లో లాయర్ గా కనిపించిన వరుణ్ ధావన్ కరీనా కోర్టు నియామకాల గురించి సీరియస్ గా ఉండమని అడిగినప్పుడు ఆమె ఇలా బదులిచ్చారు. ``అబ్ తు సిఖాయేగా ముఝే,.. సిఖ్నీ హు మెయిన్ బతిండా కీ,.. సబ్ ఆతా హై ముఝే, ,..ట్రైన్ పకడ్నే సే లేకర్ కేస్ జీత్నే తక్`` అని వ్యాఖ్యానించింది. మీరు నాకు నేర్పిస్తారా? నేను బటిండాకు చెందిన సిక్కు మహిళను.. రైలును పట్టుకోవడం నుండి కేసు గెలవడం వరకు నాకు అన్నీ తెలుసు అని దీని అర్థం.
బెబో రెండు నాలుకల ధోరణి
కరీనా కపూర్ ఇటీవల అమీర్ ఖాన్ చిత్రం `లాల్ సింగ్ చద్దా`లో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్ల రేసులో ఫ్లాపైన సంగతి తెలిసిందే. ఈ పరాజయం వెనక #BoycottLaalSinghChaddha ధోరణి ఒకటిగా పరిగణనలో ఉంది. అంతకుముందు కరీనా కపూర్ బహిష్కరణ సంస్కృతి గురించి మాట్లాడింది. దాని గురించి పెద్దగా బాధపడకూడదని పేర్కొంది. ఇప్పుడు కరీనా అందుకు భిన్నంగా లాల్ సింగ్ చద్దాను బహిష్కరించాలా? అంటే వద్దు అని అభ్యర్థించింది.
సోషల్ మీడియా ఆగ్రహం సినిమాను ప్రభావితం చేయదని గతంలో పేర్కొన్న బెబో ఇప్పుడు మాట మార్చింది. గతంలో ఓసారి మాట్లాడుతూ..``ఇది కేవలం ఒక వర్గం వ్యక్తుల ట్రోలింగ్ మాత్రమే. కానీ వాస్తవానికి ఈ చిత్రం పొందుతున్న ప్రేమ చాలా భిన్నంగా ఉందని నేను భావిస్తున్నాను. ట్రోలర్లు అంతా సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తులలో ఒక విభాగం మాత్రమే. 1 శాతం లాగా`` అంటూ కరీనా కవర్ చేసింది.
అయితే తాజాగా తన సినిమాని బహిష్కరించడంపై ప్రతిఘటించింది. తన చిత్రాన్ని చూడమని ప్రజలను అభ్యర్థించింది. ఈ చిత్రాన్ని బహిష్కరించకూడదు.. ఇది చాలా అందమైన చిత్రం. ప్రజలు నన్ను -అమీర్ (ఖాన్)ని తెరపై చూడాలని నేను కోరుకుంటున్నాను. ఆమె కొనసాగింది. మూడేళ్ళు అయ్యింది.. మేము చాలా కాలం వేచి ఉన్నాము. కాబట్టి దయచేసి ఈ చిత్రాన్ని బహిష్కరించకండి.. ఎందుకంటే ఇది నిజానికి మంచి సినిమాని బహిష్కరించినట్లే. ప్రజలు దానిపై చాలా కష్టపడ్డారు. రెండున్నరేళ్లుగా ఈ చిత్రానికి 250 మంది పనిచేశాం.. అంటూ ఇంటర్వ్యూవర్ తో అన్నారు. అయితే కరీనా ప్రచారాన్ని పట్టించుకునే సమయం ఇప్పుడు ప్రజలకు లేదు. లాల్ సింగ్ ఫ్లాప్ అని ఇప్పటికే ఖరారైంది.