ఫోటో స్టోరీ: ఫ్యామిలీ ఫ్యామిలీ స్విమ్ సూటే!

Update: 2020-04-10 07:10 GMT
సెలబ్రిటీలతో సహా అందరూ లాక్ డౌన్ లో ఉన్నారు. దీంతో బయటకు వెళ్లే అవకాశం లేదు.  వెకేషన్లకు వెళ్లే అవకాశం అంతకన్నా లేదు.  బీచులు లేవు  థాయ్ మసాజులు లేవు.  గోవా స్టోరీ సిట్టింగులు.. పట్టాయా డైలాగు రైటింగులు అన్ని అటకెక్కాయి. ఇక హీరోయిన్లు అయితే ఇంటిపనులు వంటపనులు చేసుకుంటున్నారు.  అవి షేర్ చేస్తే బా..గోదని కసరత్తులు చేసే ఫోటోలు చేస్తున్నారు.  కొందరేమో ఫ్లాష్ బ్యాక్ ఫోటోలు చేస్తూ హీట్ పెంచుతున్నారు. సీనియర్ బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ కూడా ఈలిస్టులో జాయిన్ అయింది.

కరీనా తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "నేను బీచుల గురించి కలలు కనడం లేదు..మీరు! #TakeMeBack" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఈ ఫోటోలో ఓ అందమైన బీచ్ లొకేషన్ లో భర్త సైఫ్ అలీ ఖాన్.. కొడుకు తైమూర్ తో కరీనా సేదదీరుతూ ఉంది. సైఫ్ ఓ షార్ట్ ధరించి బోర్లా పడుకుని హాయిగా ఆడుకుంటున్న కొడుకు తైమూర్ ను చూస్తూ ఉన్నాడు.  కరీనా రెడ్ కలర్ బికినీ ధరించి కొబ్బరినీరు తాగుతూ యమా హాటుగా ఫోటోకు పోజిచ్చింది. నేపథ్యం లోసముద్రం .. పచ్చనికొండలు.. ఓ బ్యూటిఫుల్ సీనరీలాగా ఉంది.

మొత్తానికి లాక్ డౌన్ సమయంలో అందరూ మథుర స్మృతులు నెమరు వేసుకుంటున్నారన్నమాట. ఈ ఫోటోకు నెటిజన్లనుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకూ 658K లైక్స్ వచ్చాయి.  క్యూట్ ఫ్యామిలీ.. హాట్ ఫ్యామిలీ అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక కరీనా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే అమీర్ ఖాన్ సినిమా 'లాల్ సింగ్ చద్దా' లో నటిస్తోంది.
Tags:    

Similar News