సెలబ్రిటీలు.. సినిమా స్టార్ల జీవితంలో జరిగే ప్రతీ సంఘటనను తెలుసుకోవాలని అనుకోవడం జనాల ఇంట్రెస్ట్ అయితే.. వారిపై నిఘా వేసిన రేంజ్ లో వెంటాడ్డం మీడియా హాబీ. ఇప్పుడు తన భార్య ప్రెగ్మెంట్ అంటూ కరీనా కపూర్ భర్త సైఫ్ అలీ ఖాన్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మీడియాలో ఆమె ప్రెగ్నెన్సీపై విపరీతంగా కథనాలు వచ్చేస్తున్నాయి. ఇదంతా చూసి కరీనాకి చిర్రెత్తుకొచ్చింది.
'నేను ప్రెగ్నెంట్ ని మాత్రమే.. శవాన్ని కాదు. మెటర్నిటీ బ్రేక్ తీసుకోవడం ఏంటసలు? బిడ్డను కనడం అనేది ప్రపంచంలో సాధారణంగా జరిగే విషయమే. మీడియా ఈ విషయాన్ని పట్టించుకోవడం మానేసి.. గతంలో ఎలా ఉన్నారో అలాగే ఉండడం నయం. నాతో పని చేసేందుకు ఎవరైనా అభ్యంతరం చెప్పినా సరే.. నేను ఎప్పటిలాగే నా పని చేసుకుంటూనే ఉంటాను. ఏదో దేశానికి ఉపద్రవం వచ్చి పడిపోయినట్లుగా.. నా గురించి రాయడం ఆపేయండి' అంటూ పెద్ద క్లాసునే తీసుకుంది కరీనా.
బిడ్డను కనడం అనేది తమ కుటుంబంలోకి ఇంకో వ్యక్తిని ఆహ్వానించడమే తప్ప.. తన కెరీర్ పై ప్రభావం చూపించే విషయం కాదని తేల్చేయడం విశేషం. మనం 18వ శతాబ్దంలో లేమని.. 2016లో బతుకుతున్నామన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రవర్తించాలని ఓ సలహా కూడా ఇచ్చింది కరీనా కపూర్ ఖాన్.