లెజెంజరీ యాక్టర్ శశి కపూర్ ఈ నెల 4వ తేదీన దివంగతులు అయిన విషయం తెలిసిందే. కపూర్ ఫ్యామిలీలో ప్రస్తుతం అత్యంత సీనియర్ అయిన ఈయన మరణం.. ఆ కుటుంబాన్ని కలచివేసింది. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా తమ తమ కార్యక్రమాలను రద్దు చేసుకుని.. భౌతిక కాయాన్ని సందర్శించుకున్నారు.
వీరిలో కరిష్మా.. కరీనా.. రణబీర్ లతో పాటు రిషి కపూర్ కూడా ఉన్నారు. అయితే.. శశి కపూర్ స్మారకంగా.. ముంబైలోని పృథ్వీ థియేటర్లో ప్రత్యేకం ప్రేయర్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా కపూర్ ఫ్యామిలీ అంతా అటెండ్ అయ్యారు. అయితే.. వీరిలో కరీనా.. రణబీర్ కపూర్ లు మాత్రం లేరు. దీంతో అనేక రకాల వదంతులు బయలుదేరాయి. దీంతో వీరి గైర్హాజరు పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది.
కరీనా కపూర్.. రణబీర్ కపూర్ లు కూడా ఈ ప్రేయర్ మీట్ కు హాజరు కావాల్సి ఉన్నా.. ముందుగా షెడ్యూల్ చేసుకున్న షూటింగ్స్ కారణంగా రాలేకపోయారట. అప్పటికే కొన్ని రోజులు షూటింగ్ కు డుమ్మా కొట్టేయడంతో.. ఇతర నటీనటులు.. సాంకేతిక వర్గానికి సంబంధించిన కాల్ షీట్స్ వృథా అవుతున్నాయట. నిర్మాతలకు భారీ మొత్తం నష్టం వాటిల్లుతుండడంతో.. వాటిని పూర్తి చేసేందుకు వెళ్లిపోయారు కరీనా.. రణబీర్.