బాలీవుడ్ నటీనటుల పెళ్లిళ్లు తరచూ బ్రేకప్ కావటం తెలిసిందే. ఆ మధ్యనే బ్రేకప్ అయిన జంటలో ఒకరికి మరో పెళ్లి జరిగిపోయింది. ఢిల్లీలో ఘనంగా జరిగిన ఈ వివాహం బాలీవుడ్ తో పాటు.. పలువురు దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ నాటి స్టార్ హీరోయిన కరిష్మాకపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ తన లవ్వర్ ని పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహంపై ఎప్పటి నుంచో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ.. తాజాగా పెళ్లి కార్యక్రమం పూర్తయ్యింది.
ఇంతకీ సంజయ్ కపూర్ పెళ్లాడింది ఎవరినో కాదు.. తన పాత స్నేహితురాలు కమ్ లవ్వర్ అయిన ప్రియా సచ్ దేవ్ నే. గడిచిన కొన్నేళ్లుగా వీరి మధ్యన బంధం ఉందన్న పుకార్లకు బలం చేకూరేలా తాజా వివాహం జరగటం గమనార్హం. ఢిల్లీలో పెళ్లి చేసుకున్నవీరిద్దరూ మరోసారి న్యూయార్క్‌లోనూ పెళ్లి చేసుకోనుండటం గమనార్హం.
బాలీవుడ్ నాటి స్టార్ హీరోయిన్ కరిష్మ కపూర్ ను పెళ్లాడి 13 ఏళ్ల దాంపత్య జీవనం తర్వాత.. గత జూన్‌లో వీరిద్దరూ చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. వీరికి 12ఏళ్ల కుమార్తె సమైరా.. ఏడేళ్ల కొడుకు రాజ్ ఉన్నారు. చాలా ఏళ్ల క్రితమే సంజయ్ కపూర్ కు ప్రియా సచ్ దేవ్ పరిచయం అయ్యారు. ఐదేళ్ల క్రితం నుంచి వీరిమధ్య బంధం బలపడిందని చెబుతుంటారు. గతంలో న్యూయార్క్ లో సంపన్నుడైన విక్రమ్ చట్వాల్ ను పెళ్లాడిన ఆమె.. తర్వాతి కాలంలో అతనితో వైవాహిక సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు. ఐదేళ్ల నుంచి సంజయ్ కపూర్ తో పెరిగిన బంధమే కరిష్మాతో విడాకులకు కారణంగా చెబుతారు.
విడాకుల ఎపిసోడ్ సందర్భంగా కరిష్మా తండ్రి రణధీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో సంజయ్ కపూర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. థర్డ్ క్లాస్ మ్యాన్ అంటూ విమర్శించిన ఆయన.. అతడికి వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదని.. కరిష్మాను ఏనాడు సరిగా చూసుకోలేదన్నారు. సంజయ్ మరో మహిళతో ఉంటున్నాడని.. అతను ఎలాంటివాడో ఢిల్లీలో అందరికి తెలుసన్నారు. ఇదిలా ఉంటే.. కరిష్మా ఈ మధ్యన ప్రముఖ వ్యాపారవేత్త సందీప్ తోష్నీవాల్‌తో సన్నిహితంగా ఉండటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/