బాలీవుడ్ ఆల్ టైం టాప్ హీరోయిన్లలో కరిష్మా కపూర్ ఒకరు. 90ల్లో దేశ యువతను ఆమె ఒక ఊపు ఊపింది. మాధురీ దీక్షిత్ డౌన్ అవుతున్న సమయంలో ఆమె ఊపందుకుందుకుని.. టాప్ హీరోయిన్ అయింది. ఇండియాలో అత్యధిక పారితోషకం అందుకున్న కథానాయికగా నిలిచింది. బాలీవుడ్ సినిమాల్లో దశాబ్దానికి పైగా హవా సాగించిన కరిష్మా.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడింది. ఐతే వైవాహిక జీవితం సజావుగా సాగకపోవడంతో కొన్నేళ్ల కిందటే విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఆమె ఫ్రీ బర్డ్. వైవాహిక జీవితంలో ఉన్నంత కాలం బయట పెద్దగా కనిపించకుండా.. లైమ్ లైట్లో లేకుండా పోయిన కరిష్మా.. విడాకుల తర్వాత స్వేచ్ఛా జీవిలా తిరిగేస్తోంది. మళ్లీ సినిమాల వైపు చూస్తున్న ఆమె.. ఫ్యాషన్ మీద దృష్టిపెడుతోంది. మళ్లీ మోడర్న్ లుక్ లోకి మారింది.
ఒకప్పటిలా అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా కరిష్మా ఓ స్టన్నింగ్ లుక్ తో ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది. బ్లాక్ థీమ్ తో ఆమె తయారైన విధానం అందరినీ ఆకట్టుకుంది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రస్ - బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ - బ్లాక్ గాగుల్స్ ధరించి కరిష్మా ప్రత్యేకంగా కనిపించింది. ఈ సందర్భంగా ఆమె దగ్గరున్న బ్యాగ్ ఖరీదెంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ బ్యాగ్ ఫ్రెంచ్ హై-ఫ్యాషన్ లగ్జరీ గూడ్స్ తయారీదారి హీర్మేస్ కు చెందిందట. దీని ధర 8,650 డాలర్లట. అంటే మన రూపాయల్లో ఆరు లక్షలన్నమాట. అంటే ఆమె బ్యాగ్ ఖరీదుతో ఒక కారే కొనేయొచ్చు. దీన్ని బట్టి కరిష్మా రేంజెంతో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే కరిష్మా, రెండో పెళ్లి చేసుకోబోతోందని అంటున్నారు. ఆమె ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఐతే ఆ వార్తలను కరిష్మా తండ్రి రణ్‌ధీర్ కొట్టిపారేశాడు.