చెలియా ఫ్లాప్ అని ముందే తెలుసా

Update: 2017-11-13 10:02 GMT
కోలీవుడ్ హీరో కార్తికి.. తెలుగులో కూడా ఫుల్ మార్కెట్ ఉంది. ఆవారా లాంటి చిత్రాలతో టాలీవుడ్ జనాలను మెప్పించిన కార్తీ.. డైరెక్ట్ మూవీ ఊపిరిలో నాగ్ తో కలిసి నటించాడు. ఇప్పుడు ఖాకీ అంటూ మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు ఈ హీరో.

తీరన్ అధికారం ఒండ్రు టైటిల్ పై రూపొందిన ఈ మూవీ.. 1990ల కాలం నాటి స్టోరీతో నడుస్తుంది. అప్పటి ఓ రియల్ లైఫ్ ఇన్సిడెంట్.. దానిపై 4 ఏళ్ల పాటు జరిగిన ఇన్వెస్టిగేషన్ ను బేస్ చేసుకుని ఖాకీ రూపొందింది. అయితే.. కొన్ని నెలల క్రితం చెలియా అంటూ 90ల్లోని స్టోరీతోనే ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ను ఫేస్ చేశాడు కార్తీ. "మణిరత్నం గారు ఈ స్టోరీని నాకు చెప్పినపుడే.. తాను ఓ ప్రయోగం చేస్తున్నానని.. మూవీ యాక్సెప్ట్ చేసే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోమని చెప్పారు. అయితే మణిరత్నం గారితో పని చేసే అవకాశం వదులుకోకూడదనే ఆ చిత్రం చేశాను" అన్నాడు కార్తీ.

ఆ మూవీ చేసే సమయంలో తాను ఎన్నో నేర్చుకున్నానని అంటున్నా.. చెలియా రిజల్ట్ ను దాదాపుగా ముందే తాను ఊహించానని చెప్పకనే చెప్పాడు ఈ హీరో. ఆ వెంటనే మళ్లీ అదే సమయానికి దగ్గరగా ఉన్న పీరియాడిక్ మూవీని ఎంచుకోవడంలో.. కార్తీ గట్స్ ను పొగడాల్సిందే.
Tags:    

Similar News