నాగ్ సర్‌ ను ప్రత్యేకంగా కలిసి థ్యాంక్యూ చెప్తా

Update: 2021-03-31 04:30 GMT
నాగార్జున నటించిన వైల్డ్‌ డాగ్‌ సినిమా ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇటీవల వైల్డ్‌ డాగ్‌ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ మా సినిమా విడుదల అవ్వబోతున్న రోజునే నా తమ్ముడు కార్తీ నటించిన సుల్తాన్‌ కూడా విడుదల కాబోతుంది. మా సినిమా తో పాటు తమ్ముడు కార్తీ సుల్తాన్‌ సినిమా కూడా విజయాన్ని అందుకోవాలంటూ కోరుకుంటున్నట్లుగా నాగార్జున వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. నాగార్జున బెస్ట్‌ విషెష్‌ తో కార్తీ ఫిదా అయ్యాడు. అంత పెద్ద స్టార్‌ తమ సినిమా ప్రమోషనల్‌ ఈవెంట్‌ లో అంత మంది ముందు సుల్తాన్‌ పేరు ఎత్తడం మామూలు విషయం కాదు. అది కూడా తన సినిమాకు పోటీగా రాబోతున్న సినిమాకు శుభాకాంక్షలు చెప్పడంతో నాగార్జున అందరి మనసులు గెలుచుకున్నాడు.

కార్తీ సుల్తాన్‌ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్‌ వచ్చాడు. ఆ సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో నాగార్జున వ్యాఖ్యలపై కార్తీ స్పందించాడు. ఈ ఇంటర్వ్యూలో నాగార్జున గారికి కృతజ్ఞతలు చెప్తే సరిపోదు. ఆయన్ను వీలు చూసుకుని కలిసి ప్రత్యేకంగా థ్యాంక్యూ చెప్తానంటూ ఈ సందర్బంగా కార్తీ చెప్పుకొచ్చాడు. వైల్డ్‌ డాగ్‌ సినిమాకు కూడా తన నుండి కార్తీ శుభాకాంక్షలు తెలియజేశాడు. వీరిద్దరు కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఊపిరి సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు సినిమాలో వీరిద్దరి కాంబినేషన్‌ కు మంచి మార్కులు పడ్డాయి. అప్పటి నుండి నాగార్జున మరియు కార్తీల మద్య అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్‌ 2 న వీరిద్దరు బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టబోతున్నారు. కనుక ఎవరిది పై చేయి అవ్వబోతుంది అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Tags:    

Similar News