డాక్టర్ బాబు.. వంటలక్క.. తెలుగులో టీవీ సీరియళ్లు చూసే అలవాటున్న వాళ్లే కాదు.. వాటిని ఫాలో అవని వాళ్లకు కూడా ఈ క్యారెక్టర్లు బాగా పరిచయం. చాలా ఏళ్ల నుంచి తెలుగులో ఆదరణ పరంగా నంబర్ వన్ సీరియల్‌గా కొనసాగుతున్న ‘కార్తీక దీపం’లో లీడ్ క్యారెక్టర్లు ఇవి. ఈ పాత్రల్లో నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్ తెచ్చుకున్న గుర్తింపు అంతా ఇంతాకాదు. సీరియల్లో వాళ్ల అసలు పేర్లు కార్తీక్, దీప. ఈ పేర్లు కలిసొచ్చేలాగే ఈ సీరియల్‌కు ‘కార్తీక దీపం’ అని పేరు పెట్టారు.
ఒక పెద్దింటికి చెందిన డాక్టర్ ఇందులో హీరో అయితే.. అతను ఇష్టపడి పెళ్లి చేసుకుని ఒక మామూలు అమ్మాయి హీరోయిన్. వీరి పెళ్లి తర్వాత ఓ అపార్థం కారణంగా ఏళ్లకు ఏళ్లు ఇద్దరూ దూరంగా ఉండిపోతారు. ఈ పాయింట్ మీదే కొన్నేళ్ల పాటు ఈ కథ నడిచింది. కొన్ని నెలల కిందటే సీరియల్లో వీళ్లిద్దరూ కలిశారు. కానీ తర్వాత ఇంకేవో సమస్యలు వచ్చాయి.
వాటన్నింటినీ దాటి కార్తీక్-దీప ఇంకెప్పుడు సంతోషంగా ఉంటారా అని ప్రేక్షకులు చూస్తుంటే.. తెలుగు టీవీ ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన ఈ క్యారెక్టర్లను చంపేశాడు దర్శకుడు కాపుగంటి రాజేంద్ర. తాజా ఎపిసోడ్లో వీళ్లిద్దరికీ యాక్సిడెంట్ అయి ప్రాణాలు పోయాయి. ఇకపై సీరియల్లో కార్తీక్, దీప ఉండరని తేలిపోయింది.
ఇది ప్రేక్షకులు అంత సులువుగా జీర్ణించుకునే విషయం కాదు. వాళ్లు అంతగా ఇష్టపడే పాత్రలను ఎందుకు చంపేశారో.. ఈ మలుపు ఎందుకు వచ్చిందో ఏమిటో? ఇక నుంచి కార్తీక్, దీపల కూతుళ్ల పాత్రలు పెద్దవై వాటి నేపథ్యంలోనే కథ నడవబోతోందట. మరి సోషల్ మీడియాలో కూడా ఎన్నో మీమ్స్‌లో కనిపించే డాక్టర్ బాబు, వంటలక్క లేకుండా ఈ సీరియల్ ఎలా ముందుకు సాగుతుందో, ఏమాత్రం ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి. ఈ చిత్ర దర్శకుడు కాపుగంటి రాజేంద్ర గతంలో మోహన్ బాబు హీరోగా ‘శివశంకర్’, అల్లరి నరేష్-గజాలా ప్రధాన పాత్రల్లో ‘రాంబాబు గాడి పెళ్లాం’ చిత్రాలను రూపొందించడం విశేషం.