నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కార్తికేయ 2 సినిమా ఏ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటూ ఉండడం విశేషం.
అంతేకాకుండా రోజురోజుకు థియేటర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. బడా హీరోల సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ కూడా నిఖిల్ సినిమా అక్కడ డామినేట్ చేస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
శ్రీకృష్ణ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరపైకి వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది. దీంతో నిర్మాతలు రోజు రోజుకు షోల సంఖ్యను కూడా పెంచుతున్నారు. ఇక మొదటి నాలుగు రోజులు భారీ స్థాయిలోనే కలెక్షన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఐదవ రోజు కాస్త స్లో అయింది. మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకున్న కార్తికేయ సినిమా 4వ రోజు 2. 17 కోట్లను అందుకుంది. ఇక ఐదవ రోజు ఈ సినిమాకు మొత్తంగా 1.61 కోట్ల షేర్ దక్కింది.
ఏపీ తెలంగాణలో చూసుకుంటే కార్తికేయ సినిమా టోటల్గా 15.32 కోట్ల షేర్ వసూళ్లను 24 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే మొత్తంగా అటువైపు నుంచి 1.23 కోట్లు వచ్చాయి ఓవర్సీస్ లో ఈ సినిమా 2.75 కోట్లను కలెక్ట్ చేసింది. ఇక హిందీలో 2.20 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఇక మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా కార్తికేయ సినిమా ఐదు రోజుల్లో 21.50 కోట్ల షేర్ కలెక్షన్స్ 37.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మొత్తంగా 12.80 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. ఇక 13.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన కార్తికేయ 2 సినిమా ప్రస్తుతం కలెక్షన్స్ బట్టి 8.20 కోట్ల ప్రాఫిట్ తో కొనసాగుతోంది.
ఇక శ్రీ కృష్ణాష్టమి హడావుడి కనిపిస్తూ ఉండడంతో ఈ సినిమాకు గురు, శుక్రవారం మరింత కలిసి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆరవ రోజు కూడా కలెక్షన్స్ మరింత పెరగవచ్చు. ఇక ఈ వీకెండ్ లో కూడా నిర్మాతలకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి మొత్తంగా కార్తికేయ 2 సినిమా పెట్టిన పెట్టుబడికి ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాలి.