యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ నటించిన సూపర్ నేచురల్ మిస్టిక్ థ్రిల్లర్ `కార్తికేయ 2`. టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా బ్యానర్ లపై తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. రెండు దఫాలుగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఆగస్టు 13న వరల్డ్ వైడ్ గా విడుదలై సంచలనం సృష్టిటిస్తోంది.
సినిమాలోని కృష్ణ తత్వం బోధపడటంతో ఉత్తరాది ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. ముందు భారీ సినిమాల కారణంగా ఉత్తరాదిలో అత్యంత తక్కువ థియేటర్లలో విడుదలైన ఈ మూవీ తొలి రోజు హిందీ వెర్షన్ కేవలం రూ. 7 లక్షలు మాత్రే రాబట్టగలిగింది. మౌత్ టాక్ స్ప్రెడ్ కావడం.. ఈ మూవీకి ముందు విడుదలైన `లాల్ సింగ్ చడ్డా`, రక్షా బంధన్` చిత్రాలు ఫ్లాప్ లుగా నిలవడంతో `కార్తికుయ 2`కు భారీ ఆదరణ పెరిగింది. అంతే కాకుండా టాక్ కు తగ్గట్టే థియేటర్లు పెరిగాయి.
దీంతో 9వ రోజు రూ. 4.07 కోట్లు వసూలు చేసి పలువురిని ఆశ్చర్యపరిచింది. యుఎస్ బాక్సాఫీస్ వద్ద వన్ మిలియన్ క్రాస్ చేసింది. నిఖిల్ కెరీర్ లో ఇదే ది బెస్ట్ గా చెబుతున్నారు.
ఇక 9వ రోజులకు ఇండియా వైడ్ గా హిందీ వెర్షన్ రూ. 15.32 కోట్ల గ్రాస్ ని వసూలు చేయడం రికార్డుగా చెబుతున్నారు. ఇంత వరకు నిఖిల్ నటించిన సినిమాల్లో ఇదే రికార్డుగా చెబుతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీతో దర్శకుడు చందూ మొండేటి రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.
అతి తక్కువ రోజుల్లో తన మూవీతో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన అతి కొద్ది మంది దర్శకుల్లో ఈ ఫీట్ ని సాధించిన దర్శకుడిగా చందూ మొండేటి రికార్డు సాధించాడు. ఈ మూవీ థియేట్రికల్ వసూళ్ల పరంగా 70 ప్లస్ కోట్ల వసూళ్లని రాబట్టి త్వరలో రూ. 100 కోట్ల దిశగా పయనిస్తోంది. నాన్ థియేట్రికల్ వసూళ్ల పరంగా రూ. 30 కోట్లని రాబట్టిన ఈ మూవీ ఈ రెండు వసూళ్లని బట్టి ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇంత త్వరగా రూ. 100 కోట్ల మార్కుని చేరిన సినిమాగా రికార్డు సొంతం చేసుకుంది.
రానున్న రోజుల్లో ఈ ఫిగర్ మరింతగా పెరిగే అవకాశం వుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక అతిథి పాత్రలో నటించడం, శ్రీకృష్ణుడి పై తెరకెక్కిన సినిమా కావడంతో ఈ మూవీకి దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతుండటంతో దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి కాసుల వర్షం కురుస్తుండటం విశేషం.