ఏపీ-తెలంగాణ‌లో 'కార్తికేయ‌-2' బ్రేక్ ఈవెన్!

Update: 2022-08-16 09:31 GMT
యంగ్ హీరో నిఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 'కార్తికేయ‌-2' స‌క్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. సినిమాకి మంచి రివ్యూలు వ‌చ్చాయి. కామ‌న్ ఆడియ‌న్స్ తో పాటు విమర్శ‌కులు మెచ్చిన చిత్రంగా నిలిచింది. మిస్ట‌క‌ల్ థ్రిల్ల‌ర్ కి యూత్ స‌హా ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఫిదా అవుతున్నారు. ఆగ‌స్టు 13 న రిలీజ్ అయిన సినిమా హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతుంది.

ఇక సినిమాకి మూడ‌వ రోజు క‌లెక్ష‌న్లు మ‌రింత మెరుగ్గా క‌నిపిస్తున్నాయి. తొలి రెండు రోజుల‌తో పొలిస్తే మూడ‌వ రోజు వ‌సూళ్ల ఉబాగా పెరిగిన‌ట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని ఏరియాల్లో షోల సంఖ్య‌..థియేట‌ర్ల సంఖ్య పెంచిన‌ట్లు తెలుస్తోంది. ఆ ఫిలలిత‌మే బాక్సాఫీస్ వ‌సూళ్ల రూపంలో క‌నిపిస్తుంది. హిందీ బెల్ట్ లో సినిమాకి మంచి రె స్పాన్స్ వ‌స్తుంది.

స్థానికంగా అక్క‌డా షోలు పెంచుతున్నారు. తాజాగా సినిమా ఏపీ-తెలంగాణ రాష్ర్టాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. అధికారిక లెక్క‌లు ఇంకా బ‌య‌ట‌కు రాలేదు గానీ వ‌రుస‌గా శ‌ని..ఆదివారం  సెల‌వులు సినిమాకి కొలిసొచ్చాయి. దీనికి తోడు ఈ వారంలో పెద్ద సినిమాలు స‌హ చిన్న చితకా సినిమా రిలీజ్ లు కూడా లేక‌పోవ‌డంతో బాక్సాపీస్ ని షేక్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

కృష్ణాష్ట‌మి  సెల‌వు దినాలు  సినిమా వ‌సూళ్ల‌కి?  కీ రోల్ పోషించే ఛాన్స్ ఉంది. 18-19 తేదీలు కృష్టాష్ట‌మి సంద‌ర్భంగా హాలీడేస్ ఉన్నాయి. ఈ సెల‌వులు  తెలుగు రాష్ర్టాలు స‌హా హిందీ బెల్ట్ వ‌సూళ్లకు క‌లిసొస్తాయి.  అటుపై ఒక‌రోజు గ్యాప్ లో ఆదివారం సెల‌వు కార్తికేయ‌దే. మొత్తానికి పాన్ ఇండియా రిలీజ్ తో హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద నిఖిల్ బాగానే రాణిస్తున్నాడ‌ని చెప్పొచ్చు.

స‌రైన హిట్ లేక వెలవెల‌బోత‌న్న నార్త్ థియేట‌ర్ల కి 'కార్తికేయ‌-2' రిలీజ్ తో ఆక్యుపెన్సీ క‌నిపిస్తుంది. వ‌చ్చే సోమ‌వారినికి  కార్తికేయ‌-2 బాక్సాఫీస్ సిల‌స‌లైన లెక్క ఎంత‌? అన్న‌ది పూర్తి క్లారిటీ వ‌చ్చేస్తుంది.  

ఈ చిత్రానికి చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం  వ‌హించిన సంగ‌తి  తెలిసిందే. పీపూల్ మీడియా ఫ్యాక్ట‌రీ-అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్స్ట్ సంయుక్తంగా నిర్మించాయి. కాల భైర‌వ సంగీతం అందించారు.
Tags:    

Similar News