టీజర్ టాక్ : సీరియస్ లవ్ యాక్షన్

Update: 2019-06-17 06:45 GMT
ఆరెక్స్ 100తో సెన్సేషన్ సాధించి హిప్పీతో ఇటీవలే పెద్ద షాక్ తిన్న కార్తికేయ తక్కువ గ్యాప్ లోనే ఇంకో సినిమాతో పలకరిస్తున్నాడు. అదే గుణ 369. బోయపాటి శీను దగ్గర అసిస్టెంట్ గా చేసిన అర్జున్ జంధ్యాల దీనితో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టీజర్ ఇందాక విడుదల చేశారు. కథను అంతర్లీనంగా చేప్పే ప్రయత్నం చేశారు. సరదాగా జీవితాన్ని గడుపుతున్న ఓ యువకుడు(కార్తికేయ). సెల్ ఫోన్ షో రూమ్ లో పనిచేసే అమ్మాయి(అనఘా)తో సరదగా మొదలైన పరిచయం ప్రేమగా మారుతుంది.

అంతా మాములుగా ఉందనుకుంటున్న తరుణంలో అతని గతం నీడలా వెంటాడుతుంది. నా అనుకునే వాళ్లకు ఏదైనా అవుతుందనే ఆలోచనలతో కోపాలకు గొడవలకు దూరంగా ఉండే ఆ యువకుడు మళ్ళి వాటి వైపు వెళ్లాల్సి వస్తుంది. అసలు ఇతను ఎవరు మనవల్ల ఇంకొకరు బాధ పడకూడదు అని చెప్పి జీవితాన్ని మార్చిన వ్యక్తి(సాయి కుమార్)ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానమే గుణ 369

టీజర్ ని బట్టి చూస్తే సాఫ్ట్ లవ్ స్టోరీగా మొదలై భారీ యాక్షన్ వైపు టర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. యాక్షన్ సన్నివేశాల్లో కార్తికేయ మీసం తిప్పి ఉండటాన్ని గమనిస్తే ఇందులో ఏదో ఫ్యాక్షన్ ఛాయలు ఉన్నట్టు అనిపిస్తాయి. చూస్తుంటే గురువు బోయపాటి తరహాలోనే అర్జున్ జంధ్యాల కూడా సేఫ్ ఫార్ములా రాసుకున్నట్టు ఉన్నాడు.

హిప్పీలో తీవ్రంగా నిరాశపరిచిన కార్తికేయ ఇందులో రెండు షేడ్స్ లో కొంత ప్రామిసింగ్ గా కనిపించాడు. హీరోయిన్ అనఘా లుక్స్ ఓకే. చేతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థీమ్ కు తగ్గట్టే ఉంది. వచ్చే నెల విడుదల కానున్న గుణ 369 నెంబర్ వెనుక మర్మం ఏమిటో ఇందులో రివీల్ చేయలేదు. మొత్తానికి ఏదో విషయం ఉందనే నమ్మకమైతే దీంతో కొంత కలిగించే ప్రయత్నం గట్టిగా చేశారు ,



Full View
Tags:    

Similar News