సెలబ్రిటీలు కొన్ని సార్లు ఎరక్కపోయి ఇరుక్కుపోతారు. అనూహ్యంగా తమ ఫ్యాన్స్ కి దొరికిపోతుంటారు. అలాంటి సమయంలో తమ అభిమాన తారలని సరదాగా ఓ ఆట ఆడుకుంటుంటారు ఫ్యాన్స్. సదరు స్టార్ అంటే గిట్టనివాళ్లయితే వల్గర్ కామెంట్స్.. చెత్త కామెంట్స్ తో చిరాకు తెప్పిస్తుంటారు. ఇలాంటి అనుభవమే బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కి ఎదురైంది. పిచ్చి పిచ్చి ప్రశ్నలతో ఇన్ స్టాగ్రామ్ లో నెటిజన్లు కార్తీక్ ని ఫుట్బాల్ ఆడేసారు. ఇంతకీ ఏం జరిగింది? అంటే...
మా ప్రశ్నకి సమాధానం చెబితే అదిస్తాం.. ఇదిస్తాం అంటూ అభిమానులే ఎరవేయడం ఆసక్తిని రేకెత్తించింది. ఓ అభిమాని తన ప్రశ్నకి జవాబు చెబితే లక్ష ఇస్తానని ఆఫర్ చేశాడు. దానికి కార్తీక్ ఆర్యన్ స్పందిస్తూ, `` జెస్సీ.. నువ్వు నన్ను మత్తమందు వ్యాపారంలో ఉన్నావా? లేక డబ్బు సంపాదించే బిజినెస్ లో ఉన్నావా? అని అడిగావు. అది కాదు.. నేను సామ్రాజ్యాన్ని నిర్మించే పనిలో ఉన్నా`` అని పేర్కొన్నాడు. దీంతో కార్తీక్ చెప్పిన సమాధానికి సదరు నెటిజన్ ఖంగు తిన్నాడు. అయితే తనకు ఇస్తానన్న డబ్బుని మాత్రం కార్తీక్ వదల్లేదు. డబ్బు ఎప్పుడిస్తావని అడిగాడు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వచ్చాయి.
మరో నెటిజన్ నా ప్రశ్నకి సమాధానమిస్తే చాక్లెట్ ఇస్తానని.. మరొకరేమో ఇలా ఫ్యాన్స్ కి ఆన్సర్ ఇస్తే కోటీశ్వరుడు కావొచ్చు అని సెటైర్స్ వేశాడు. అంతటితో ఆగలేదు.. ఓ అమ్మాయి నన్నుపెళ్ళి చేసుకుంటే కోటి రూపాయలిస్తా అని బేరం స్టార్ట్ చేసింది. ఇలా వరుసగా కార్తీక్ ని కొంటె ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకున్నారు.
కార్తీక్ సినిమాల పరంగా చూస్తే..`సోనూ కే టీటూ కి స్వీటీ` చిత్రంలో మంచి బ్రేక్ ని అందుకున్న కార్తీక్ ఆ తర్వాత వరుసగా `లుకా చుప్పీ`..`పతి పత్నీ ఔర్ ఓ`, ఇటీవల `లవ్ ఆజ్ కల్ 2`లతో వరుసగా విజయాలను అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన `భూల్ బులయ్యా2`లో నటిస్తున్నాడు. ఆయన సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. దీనికి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక భన్సాలీ.. సుర్జీత్ సిర్కార్ లాంటి టాప్ డైరెక్టర్స్ తో పని చేయాలనుందని కార్తీక్ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాడు.