కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీ భాష విషయంలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. సౌత్ సినిమాలు ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. సౌత్ భాషల్లో రూపొందిన సినిమాలు అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సమయంలో హిందీ భాషను బలవంతంగా దేశం మొత్తం రుద్దాల్సిన అవసరం ఏంటీ అంటూ సౌత్ ఇండియన్ సినీ వర్గాల వారు మరియు ఇతర నాయకులు సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మరియు కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ల మద్య ట్విట్టర్ లో మాటల యుద్దం జరిగిన విషయం తెల్సిందే. హిందీ ని జాతీయ భాష గా గుర్తించాల్సిందే.. ప్రతి ఒక్కరు కూడా హిందీని నేర్చుకోవాల్సిందే అంటూ అజయ్ దేవగన్ చేసిన వ్యాఖ్యలను చాలా మంది కొట్టిపారేశారు.
తాజాగా ప్రముఖ జాతీయ వార్త ఛానల్ లో కూడా ఈ విషయమై చర్చ జరిగింది. ఆ చర్చ కార్యక్రమంలో సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ పాల్గొన్నారు. ఆ చర్చలో ఆమె హిందీ భాషను సౌత్ ఇండియన్ జనాలపై బలవంతంగా రుద్దడంను ఖండిస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. కేవలం సౌత్ ఇండియన్స్ పైనే కాకుండా ఈశాన్య రాష్ట్రాలపై కూడా హిందీని బలవంతంగా రుద్దుతున్నారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
మా పై ఎందుకు బలవంతంగా హిందీ రుద్దుతున్నారు. మా అప్పటి నుండి కూడా స్కూల్స్ లో ఇంగ్లీష్.. హిందీతో పాటు స్థానిక భాష ను చెబుతున్నారు. మేము మూడు భాషలను అభ్యసించేలా చేశారు. ఇప్పటికి కూడా మూడు భాషలను బలవంతంగానే మేము నేర్చుకునేలా చేస్తున్నారు.
సౌత్ ఇండియాలో మెజార్టీ జనాలు హిందీని కొంతలో కొంత అయినా మాట్లాడటం రాయడం చేస్తారు. కాని ఉత్తర భారతం కు చెందిన వారు ఎవరైనా సౌత్ ఇండియన్ భాషల్లో ఏ ఒక్క భాషను అయినా మాట్లాడగలరా.. కనీసం అర్థం చేసుకోగలరా అంటూ కస్తూరి ప్రశ్నించారు.
ఆమె ప్రశ్నకు చర్చ ప్యానల్ లో ఉన్న వారు అంతా కూడా సైలెంట్ అయ్యారు. ఎంత సేపటికి హిందీని జాతీయ భాష గా గౌరవించాల్సిందే అంటూ వాదిస్తున్నారు తప్ప ఇతర భాషలకు ఉన్న గౌరవంను కాపాడాల్సిన బాధ్యత లేదా అంటూ ఆమె ఈ సందర్బంగా కేంద్రంకు చెప్పుకొచ్చింది.