దాదాపు నెల రోజుల నుంచి తరచుగా ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూనే ఉంది ‘కాటమరాయుడు’ టీమ్. గతంలో పవన్ సినిమాలకు సంబంధించి విడుదలకు ముందు పెద్దగా విశేషాలు బయటికి వచ్చేవి కావు కానీ.. ‘కాటమరాయుడు’ టీం మాత్రం ఇప్పటికే సినిమాకు సంబంధించి చాలా ఫొటోల్ని మీడియాతో పంచుకుంది. కొత్త సంవత్సరాది సందర్భంగా పవన్ లుక్స్ తో ఎలా హడావుడి చేశారో తెలిసిందే.
తర్వాత‘ కాటమరాయుడు’ టీజర్ కూడా బాగానే సందడి చేసింది. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్లీ కొత్త పోస్టర్ల రచ్చ మొదలుపెట్టారు. ఈ రోజు పవన్-శ్రుతి హాసన్ జోడీ కొబ్బరి తోటలో రొమాంటిక్ మూడ్లో ఉన్న ఫొటో ఒకటి రిలీజ్ చేశారు. అది ఇన్ స్టంట్ గా జనాలకు ఎక్కేసింది. రాయుడి గారి రొమాంటిక్ టచ్ అంటూ ఈ ఫొటో గురించి అభిమానులు డిస్కషన్స్ మొదలుపెట్టారు.
ఈ పోస్టర్ కు సంబంధించిన మరో విశేషం జనాల దృష్టిని ఆకర్షించింది. పవన్.. శ్రుతిల మధ్య ఉన్న బుల్లెట్ మీద ‘ఏపీ 21 బి’ అని ఉంది. ఆ రిజిస్ట్రేషన్ కర్నూలు పరిధిలోనిది. అంటే ఈ చిత్రం కర్నూలు బ్యాక్ డ్రాప్ లో సాగుతుందన్నమాట. ‘కాటమరాయుడు’ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా అని తెలుసు కానీ.. పర్టికులర్ గా ఏ ప్రాంతంలో సినిమా నడుస్తుందన్న విషయంలో క్లారిటీ లేదు. కొత్త పోస్టర్ ఈ విషయంలో స్పష్టత ఇచ్చేసింది.