కాటమరాయుడు కోసం ఏం చేస్తారు సామీ?

Update: 2017-03-02 11:52 GMT
ఈ మధ్యకాలంలో మెగా హీరోలందరూ మూకుమ్మడిగా ఒకటే మంత్రం ఫాలో అయిపోతున్నారు. తమ సినిమాలకు ఆడియో ఫంక్షన్లకు జరుపడం లేదు. కేవలం ప్రీ-రిలీజ్ ఫంక్షన్లు చేస్తున్నారు. అసలు ఆడియో ఫంక్షన్ అంటే కేవలం సంగీత దర్శకుడి భజన ఎక్కువగా చేయాలి. అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఇక ఏ రచ్చ చేసినా పర్లేదు. అందుకేనేమో.. సరైనోడు.. ధృవ.. ఖైదీ నెం 150 సినిమాలకు ప్రీ-రిలీజ్ ఈవెంట్ మాత్రమే చేశారు. ఇప్పుడు కాటమరాయుడు కూడా అదే ఫాలో అవుతున్నాడు. మార్చి 24న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ఇప్పుడు ఇదొక్కటే మేజర్ ఈవెంట్. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఆడియో రిలీజ్ చేయడం వంటి ప్లాన్స్ ఏమీ లేవు.

అయితే ఈ కాటమరాయుడు ఈవెంట్ ను చాలా కొత్తగా డిఫరెంటుగా చేయాలని నిర్మాత శరత్ మరార్ చాలా ప్లాన్స్ వేస్తున్నాడట. ఇంతకీ కొత్తగా అంటే ఏం చేస్తారు? ప్రీ-రిలీజ్ ఈవెంట్ అంటే సినిమాకు సంబంధించిన పెద్దలు అందరూ రావడం.. సినిమా గురించి మాట్లాడటం చేస్తారు. ఎలాగో పవన్ సినిమా కాబట్టి పవన్ ఏదో ఒకటి మాట్లాడాల్సిందే. విశిష్ట అతిథులను పిలుస్తారు. అందరూ కావాలంటే ఒకటే డ్రస్ కోడ్ వేసుకుంటారు. స్టేజీ మీద సాంస్కృతిక కార్యక్రమాలు.. ఆ తరువాత పాటలకు డ్యాన్సులు.. అలాగే కొన్ని జోకులు.. వైరల్ స్పీచులు.. ఇవన్నీ చేసేస్తారు. వీటికంటే యునిక్ గా మరి కాటమరాయుడు టీమ్ ఏం చేస్తుందంటారు? వెయిట్ అండ్ సి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News