తారక్ పై కత్తి కామెంట్స్

Update: 2017-08-31 08:23 GMT
ప్రస్తుతం బిగ్ బాస్ షో తెలుగులో బాగానే నడుస్తోంది. మొదట్లో కొంత డల్ గా నడిచిన ఈ షో రోజులు గడుస్తున్నా కొద్దీ ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా షోలో పార్టిసిపెంట్స్ వారానికి ఒకరు వెళిపోతుండడంతో ఆట రసవత్తరంగా సాగుతోంది. దీనికితోడు ఎన్టీఆర్ కూడా తనదైన శైలిలో షోని నడిపిస్తూ..అసలైన బిగ్ బాస్ అని నిరూపించుకుంటున్నాడు.

అయితే ఇటీవల షో నుండి ఎలిమినేట్ అయిన రేడియో జాకీ మరియు యాంకర్ కత్తి కార్తీక బిగ్ బాస్ షో గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. దాదాపు 43 రోజుల పాటు హౌస్ లో ఉన్న ఈ తెలంగాణ అమ్మాయి రీసెంట్ గా ఓ మీడియా ఛానల్ తో చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆమె ఏమందంటే.. తారక్ హోస్టింగ్ గురించి మాట్లాడుతూ.. 'ఎప్పుడైతే తారక్ అన్నను ఫేస్ టూ ఫేస్ చూశానో.. అప్పుడే అన్నా మరో వంద సీజన్లు నువ్వే హోస్ట్ చెయ్. నన్ను కొట్టినా పర్లేదు అలాగే నీకు తెల్ల వెంట్రుకలు వచ్చినా.. రంగు మాత్రం వేసుకోకుండా అట్లనే చెయ్’ అని ముఖం మీదనే చెప్పేశానని కార్తికా ఇంటర్వ్యూలో చెప్పింది.

అంతే కాకుండా షోలో పాల్గొనడం వల్ల ఇన్ని రోజులు తన కొడుకుని చాలా మిస్ అయినట్లు చెప్పింది. ఇక బిగ్ బాస్ షో అనేది స్క్రిప్ట్ లేని ఓకే షో అని దాన్ని ఎన్టీఆర్ అన్న చాలా చక్కగా వ్యవహరిస్తూ.. ముందుకు తీసుకువెళుతున్నడని చెబుతూ.. తప్పు చేస్తే అమ్మానాన్న ఎలా సరిదిద్దుతారో తారక్ అన్న కూడా అలానే సరిదిద్దుతారని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ప్రతి విషయాన్ని తారక్ అన్న చాలా జాగ్రత్తగా గమనిస్తారని చెబుతూ.. అయన చాలా టాలెంటెడ్ పర్సన్ అని ప్రశంసల జల్లును కురిపించింది కత్తి కార్తీక. 
Tags:    

Similar News